బిగ్ బాస్ సీజన్ 4లో బెస్ట్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు జబర్దస్త్ అవినాష్. జబర్దస్త్ నుండి మొదటిసారిగా బిగ్ బాస్ కు వచ్చిన హౌజ్ మేట్ గా అవినాష్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నాగార్జున కూడా అవినాష్ ను చాలా పొగుడుతున్నాడు. ఈ సీజన్ లో కామెడీని పండించిన ఘనత అవినాష్ కు దక్కింది. వీకెండ్ లో నాగార్జున మాత్రమే అవినాష్ ఆటాడుకుంటున్నాడు అయితే మండే ఎపిసోడ్ లో హౌజ్ మేట్స్ కూడా అవినాష్ ను ఆటాడుకున్నారు.

హౌజ్ లోకి వచ్చాక అవినాష్ పొట్ట తగ్గిందని అంటుండగా పొట్ట తగ్గించి సీటు పెంచాడని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, సోహెల్, అరియానా ముగ్గురు కలిసి అవినాష్ ను ఆటాడుకున్నారు. అయితే లో ఎంటర్టైనర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు అవినాష్. బిగ్ బాస్ సీజన్ 4 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటరన్నది మాత్రం ఎక్సయిటింగ్ గా ఉంది. హారిక కెప్టెన్ కాబట్టి ఆమె సేఫ్ అయినట్టే. తెలుస్తున్న సమాచారం ప్రకారం హారికతో పాటుగా మోనాల్ కూడా సేఫ్ అయ్యిందని అంటున్నారు.

హౌజ్ లో ప్రస్తుతం ఏడుగురు హౌజ్ మేట్స్ ఉండగా వారిలో ఇద్దరు సేఫ్ అయ్యి మిగిలిన ఐదుగురు నామినేట్ అయినట్టు తెలుస్తుంది. చూస్తుంటే ఈ వారం ఎలిమినేషన్స్ కు హౌజ్ మేట్స్ మధ్య టఫ్ ఫైట్ జరిగేలా ఉంది. ప్రస్తుతం ఉన్న వారిలో మాత్రం అభిజిత్, మోనాల్ తప్ప అందరు కెప్టెన్ గా అయిన వారు ఉన్నారు.

                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: