బీటౌన్ సీనియర్ హీరోయిన్లే ఇలా చేస్తుంటే... ఈ తరం బ్యూటీలు ఆగుతారా చెప్పండి. గ్యాప్ వచ్చి చాలాకాలమైంది కదా అని చెప్పి.. ఏకంగా బూర్జ్  ఖలీఫాపైకి ఎక్కడం, జంగిల్ సఫారీలు చేయడం లాంటివి చేసి.. రిలాక్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఈ తరం తారలు హాలీడే ట్రిప్ ను ట్రెక్కింగ్ లెవెల్లోనే ప్లాన్ చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు.

సెలబ్రెటీలకు, విఐపీలకు అవుటింగ్ కు వెళ్లడానికి ఏదో ఒక కుంటిసాకు కావాలి. అలా దొరికితే చాలు దేశాలు దాటి ఎగిరి పోవడానికి ఇట్టే రెడీ అయిపోతారు. పూజా బేడి కూతురు.. నటి అలయా ఎఫ్ కు అన్ లాక్ లో అలాంటి వంకే దొరికింది. బాల్ థాకరే మనవడు ఐశ్వర్య  థాకర్ బర్త్ డే కు దుబాయ్ ఫ్లయిట్ ఎక్కింది. అక్కడ జరిగిన బర్త్ డే పార్టీకి సెలబ్రెటీలతో కలిసి చిందులేసింది. అక్కడితో ఊరుకోకుండా దుబాయ్ బూర్జ్ ఖలీఫా టాప్ ఫ్లోర్ లో జలకాలాడింది.

అంతగా నోటెడ్ కాని నేటితరం తార అలయా ఎఫ్ ఇంతలా హడావిడి చేస్తే... లస్ట్ స్టోరీస్ తో ఎంటైర్ హిందీ ఎంటర్ టైన్ మెంట్ లవర్స్ ను అలరించిన కైరా అద్వాని  కామ్ గా ఉంటుందా ఏంటి..? అస్సలు ఉండదు కదా.అందుకే లాక్ డౌన్ టైమ్లో ఇంట్లోనే ఫ్యామిలీతో గడిపి  అన్ లాక్ వచ్చాక మిలాన్ కు ఫ్యామిలీతో ట్రిప్ వేసింది.

ఇటలీ ఫ్యాషన్ క్యాపిటల్ మిలాన్ లో ప్రీమియమ్ ఫైవ్ స్టార్ హోటల్ లో దిగిన కైరా ..తన హాలీడే టైమ్ ను అక్కడ షాపింగ్ చేయడంతో పాటు నగరంలోని హిస్టరీ డీటైల్స్ ను తెలుసుకోవడంపై దృష్టి పెట్టింది.అలాగే ఇటాలియన్ ఫుడ్ లోని టేస్ట్ ను రుచిచూస్తూ అక్కడి లేక్ కోమ్ వాటర్ లో సేదతీరింది. ఐతే ఈ హాలీడే ట్రిప్ లో ఎక్కడా అతి చేసే  పిక్స్ తో... మిగతావారిలా వైరల్ చేసే పిక్స్ ను నెట్టింట్లో షేర్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: