ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....ప్రదీప్...తనదైన పంచ్ లతో అలాగే మంచి టైమింగ్ తో  బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యి టాప్  యాంకర్ గా దూసుకుపోతున్నాడు. విపరీతమైన అభిమానులని సంపాదించాడు. అనేక  కార్యక్రమాల్లో తనదైన కామెడీ డైలాగులతో  ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తుంటాడు. పలు సినిమా ఫంక్షన్లకు హోస్ట్‌గా కూడా వ్యవహరించిన ప్రదీప్ .. మరికొద్ది రోజుల్లో వెండితెరపై హీరోగా కూడా అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుమ నిర్వహిస్తున్న ఓ టీవీ ‌షోలో పాల్గొన్న ప్రదీప్.. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సంఘటనలను, అలాగే మెగాస్టార్‌తో మీట్ తాలూకు విశేషాలను పంచుకున్నాడు.

ప్రదీప్ కి మంచి  యాంకర్‌గా ఓ గుర్తింపు వచ్చాక మొదటిసారి మెగాస్టార్‌ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు .. చిరంజీవి  తనను పేరుపెట్టి పిలుస్తూ ఎంతో ఆప్యాయత చూపించారని తెలిపాడు ప్రదీప్. ''మీ వాయిస్‌ నాకు చాలా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది'' అని ఆయన ప్రశంసించడం ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు. చిరంజీవి తనతో మాట్లాడుతుంటే అలాగే నిల్చుండిపోయానని, ఆ సమయంలో కూర్చోండి అంటూ మెగాస్టార్ అనడం.. ఆ క్షణాలు మరచిపోలేనివి అని  ప్రదీప్ చెప్పాడు.

ఇక ఇన్ని రోజులు  బుల్లితెరపై సందడి చేసి ఆకట్టుకున్న యాంకర్ ప్రదీప్.. ఇకపై వెండితెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. ప్రదీప్ హీరోగా మన ముందుకు రాబోతున్న కొత్త సినిమా  '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’ పాటకు భారీ ఆదరణ లభిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ శిష్యుడు మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ప్రదీప్ సరసన అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు.ఇలాంటి మరెన్నో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: