ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తెలుగు మూవీ ఇండస్ట్రీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  వరాల జల్లు కురిపించారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని సీఎం కేసీఆర్  అన్నారు. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టో విడుదల కోసం సోమవారం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని  ఆదుకోవడం కోసం తీసుకోబోతున్న చర్యలను గురించి స్పష్టంగా చెప్పారు..ముంబై, చెన్నై, హైదరాబాద్.. ఈ మూడు ప్రాంతాలు చిత్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని.. వీరిలో 16 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నారు.



సినీ పరిశ్రమ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది కాబట్టి రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని కేసీఆర్ చెప్పారు. ఈ 40 వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు సహా సామాన్య ప్రజలకు అందించే అన్ని సదుపాయాలు అందిస్తామని సీఎం కేసీఆర్ అనౌన్స్ చేశారు.అంతే కాకుండా  సినిమా థియేటర్లు ఏప్రిల్ నెల నుంచే పూర్తిగా  మూతబడి ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి మళ్లీ తెరుచుకునేంత వరకు కరెంట్ బిల్లులు రద్దు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ బిల్లుల రాయితీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. మరోవైపు, రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ 9 శాతాన్ని రీఎంబర్స్‌మెంట్ చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. సినిమాలపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ మొత్తంగా 18 శాతం ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో 9 శాతం రాష్ట్ర జీఎస్టీ ఒకేసారి రీఎంబర్స్‌మెంట్ చేస్తారు.పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు పరిమితి లేకుండా షోలు వేసుకోవడానికి థియేటర్లకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.


అలాగే, టిక్కెట్ ధరలను సవరించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. ఈ వెసులుబాటు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో ఉందని.. హైదరాబాద్‌లో కూడా కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. థియేటర్లు తెరుచుకోవడానికి అతి త్వరలో జీవోను జారీ చేస్తామని.. అయితే, థియేటర్లు తెరవడం ద్వారా కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా  చూసుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమదేనని కేసీఆర్ చెప్పారు. సినిమా థియేటర్లను డిసెంబర్ నుంచి తెరుచుకుంటారో లేదంటే సంక్రాంతికి తెరుస్తారో ఆ యజమానుల ఇష్టం అని సియం కేసీఆర్ అన్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: