బిగ్ బాస్ సీజన్ 4లో మండే నామినేషన్స్ హంగామా తెలిసిందే. ఈసారి లక్ ఫ్యాక్టర్ తో నామినేషన్స్ షురూ చేశాడు బిగ్ బాస్. రెడ్ హ్యాట్, గ్రీన్ హ్యాట్ అంటూ హౌజ్ లో ఉన్న ఏడుగురిలో ఆరుగురికి ఈ నామినేషన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హారిక కెప్టెన్ కాబట్టి ఆమెని ఈ నామినేషన్స్ నుండి తప్పించాడు. ఇక ఇదిలాఉంటే రెడ్ హ్యాట్ వచ్చిన వారు నామినేషన్స్ లో ఉన్నట్టు.. ఇక గ్రీన్ హ్యాట్ ఉన్న వారిని స్వాప్ కూడా చేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో మోనాల్ ను కన్విన్స్ చేసే క్రమంలో మోనాల్ తో అవినాష్ గొడవ పడ్డాడు. అరియానా, అఖిల్, అభిజిత్ కూడా రెడ్ హ్యాట్ ధరించగా ఈ క్రమంలో అఖిల్, అరియానాలకు కూడా మోనాల్ కన్విన్స్ అవలేదు. ఫైనల్ గా అభిజిత్ కు మోనాల్ కన్విన్స్ అయ్యి.. అతని ప్లేస్ లో నామినేట్ అవడానికి ముందుకొచ్చింది.

సో ఈ లెక్కన చూస్తే 12వ వారంలో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ నామినేషన్స్ లో ఉంటారని తెలుస్తుంది. అయితే ఈ నామినేషన్స్ లో మోనాల్ అఖిల్ కు సపోర్ట్ చేయకుండా అభిజిత్ ను సేఫ్ చేయడంపై ఆడియెన్స్ షాక్ అయ్యారు. అఖిల్ గతవారం ఆమెను దూరం పెట్టగా ఇప్పుడు ఆమె అతన్ని కాదని అభిజిత్ ను సేవ్ చేసింది. ఫైనల్ గా 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ క్రేజీగా మారింది. మరి నలుగురు హౌజ్ మేట్స్ ఉన్న ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఈ వారం బయటకు వస్తారో చూడాలి.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: