టాలీవుడ్ నటి  రష్మిక మందన్న ని గూగుల్ ఈ సంవత్సరానికి గాను   నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా గా ప్రకటించింది .. ఇదే రష్మిక సాధించిన అరుదైన ఘనత .. 2019 -2020 మధ్య కాలంలో రష్మిక పేరుని భారతియులు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది ...  

రష్మిక మందన్న ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు ..కానీ కిరిక్ పార్టీ కంటే ముందు ఆమె ఎవరో తెలీదు .. కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీ అనే చిత్రం తో ఆమె కన్నడ సినిమాలోకి పరిచయం అయ్యింది .. ఆ తర్వాత అంజనీపుత్ర ,యజమాన అనే కన్నడ సినిమాలలో నటించింది .. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది ..

నాగశౌర్య హీరోగా, వెంకీ  కుడుముల దర్శకత్వం లో వచ్చిన ఛలో చిత్రం తో రష్మిక తెలుగులోకి పరిచయం అయ్యింది .. ఛలో చిత్రం  ఇచ్చిన విజయంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరుస కొద్దీ తెలుగు సినిమాలు చేసింది .. ఛలో నుండి భీష్మ వరకు తాను  చేసిన సినిమాలన్ని  సూపర్ హిట్ అయ్యాయి  ..అందులో భాగంగా విజయ్ దేవరకొండ ,రష్మిక చేసిన గీత గోవిందం భారీ విజయాన్ని నమోదు చేసింది ..ఇందులో రష్మిక నటన తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది .తెలుగింటి అమ్మాయిల చాలా చక్కని పాత్రలో నటించింది రష్మిక ..అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన సరిలేరు నీకెవ్వరూ అనే చిత్రం లో నటించి మెప్పించింది ..

రష్మిక టాలీవుడ్ కి వచ్చిన కొత్తలోనే తన నటనతో విశేష అభిమానుల్ని సంపాదించుకుంది.  ప్రస్తుతం రష్మిక అల్లుఅర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తుంది .. గూగుల్ తనకి ఇలా నేషనల్  క్రష్ అఫ్ ఇండియా గా ప్రకటించడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేస్తుంది ..  

మరింత సమాచారం తెలుసుకోండి: