వరుసగా భారీ బర్జెట్ సినిమాలను ఒప్పుకుంటూ పాన్ ఇండియా స్టార్ అనే పదానికి పూర్తి న్యాయం చేస్తున్నాడు ప్రభాస్.ప్రస్తుతం తీరిక లేకుండా మూడు భారీ సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ఒకటి 'జిల్' ఫేం  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి.

 కాగా ఈ సినిమాలో హీరోకి తమ్ముడి రోల్ ఒకటి ఉందట. అయితే ఆ రోల్ లో నటుడు కాం సంగీత దర్శకుడైనా జీవి ప్రకాష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే రోల్ లో తమిళ్ యంగ్ హీరో అథర్వా కనిపించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు ఆ రోల్ లో జీవి ప్రకాష్ నటిస్తున్నాడట.

 కాగా ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు.మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి సాహో తో నిరాశపరచిన ప్రభాస్ ఈ  సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: