తొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.  అంతకుముందు కెరీర్ పరంగా కొంత సతమతమవుతున్న హీరో కళ్యాణ్ రామ్, తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ పటాస్ సినిమా హిట్ తో మంచి బ్రేక్ ను అందుకున్నారు. ఇక ఆ తర్వాత మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుప్రీం సినిమాని తీసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి.

ఆ పై మాస్ రాజా రవితేజ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా తో ఇంకో విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి వీటి అనంతరం విక్టరీ వెంకటేశ్ వరుణ్ తేజ్ ల కలయికలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎఫ్2 తీసి దానితో కూడా మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా విజయశాంతి ప్రధానపాత్రలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి తన కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి అతి త్వరలో తన తదుపరి సినిమా ఎఫ్3 కోసం సిద్ధమవుతున్నారు.

మొత్తంగా వీటితో ఇప్పటివరకూ తన కెరీర్లో ఒక్క అపజయం కూడా చవి చూడకుండా వరుస విజయాలతో దూసుకెళుతున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నేడు జన్మదినాన్ని జరుపుకోవడంతో పలువురు అభిమానులు అలానే సినీ ప్రముఖులు ఆయనకు వెల్లువలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అనిల్ రావిపూడి కి శుభాకాంక్షలు తెలియజేశారు. మీతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది అదేదో నిన్న జరిగిన ఘటన మాదిరిగా నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి అంటూ మహేష్ తన పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్టు పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: