విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు డైరక్షన్ లో వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమా ఈమధ్యనే అమేజాన్ ప్రైం లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జోడీ అలరించింది. సినిమా అంతా చాలా సహజంగా తెరకెక్కించాడు వినోద్ అనంతోజు. ఇక ఈ సినిమా డైరక్టర్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన కథనే సినిమా కథగా మార్చినట్టు చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా కథ పట్టుకుని చాలామంది దర్శకుల దగ్గర తిరిగానని.. హీరోగా కూడా ఆనంద్ దేవరకొండని అనుకోలేదని అన్నాడు డైరక్టర్. ముందు వేరే హీరోలను ట్రై చేశామని కాకపోతే వారు నో చెప్పారని.. దొరసాని సెట్ లో ఆనంద్ దేవరకొండకు ఈ సినిమా కథ చెబితే ఒప్పుకున్నారని అన్నాడు. అతను కూడా ఓకే అనకపోతే కొత్త హీరోతో చేద్దామని అనుకున్నాడట.

ఫైనల్ గా ఆనంద్ దేవరకొండ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడ్డది. తమ్ముడి సినిమా చూసి విజయ్ దేవరకొండ కూడా సూపర్ అనేశాడు. సినిమా గురించి చిన్నపాటి రివ్యూ ఇచ్చి కష్టపడు ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అని చెప్పాడు విజయ్. మొత్తానికి ఆనంద్ తన సత్తా చాటాలని చెప్పొచ్చు. దొరసానిలో కూడా ఆనంద్ నటన బాగున్నా అది ఫైనాన్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. కాకపోతే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించింది. అమేజాన్ ప్రైం రైట్స్ తక్కువగా అమ్మినా శాటిలైట్ రైట్స్ మాత్రం భారీగా వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.                                                             



మరింత సమాచారం తెలుసుకోండి: