కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా  టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..రాజా ది గ్రేట్, f2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు..

అయితే మహేష్ బాబు తో సూపర్ హిట్ సినిమా ని చేసి ఇప్పటివరకు ఏ హీరో తో సినిమా అనౌన్సు చేయకపోవడంతో అనిల్ రావిపూడి ఫాన్స్ కొంత నిరాశ లో ఉన్నట్లు తెలుస్తుంది. తొలుత అనిల్ సాయి పల్లవి తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.. యా తర్వాత నాగార్జున తో సినిమా అని గాసిప్స్ వచ్చాయి.. కానీ తాజా సమాచారం ప్రకారం అనిల్  F3 మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది..సరిలేరు తర్వాత అనిల్ చేయబోయే  సినిమా ఇదే అని తెలుస్తుంది.

ఇక ఎఫ్3 ఎలా ఉండబోతోందన్న దాని మీద కొన్ని లీకులు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మొగుడు పెళ్లాల సరదాలు అల్లరితో గడిచిపోవడంతో ఈసారి పిల్లల్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే వెంకటేష్ కు మాత్రమే సంతానాన్ని పెట్టి వాళ్ళ వల్ల వరుణ్ తేజ్ జంట ఇబ్బందులు పడటాన్ని ఇందులో చూపించవచ్చని అంటున్నారు. ఇదేమి అనిల్ అధికారికంగా చెప్పింది కాదు కానీ నిజమైనా కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ కు ఢోకా లేనట్టే. మూడో హీరో కూడా ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అందులో వాస్తవం ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: