తెలుగు సినిమాలకు, సినీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అదేంటంటే..కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు కాస్త ఊరట నిచ్చే విధంగా టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టో పేర్కొన్నారు.సోమవారం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమను ఆదుకోవడం కోసం తీసుకోబోతున్న చర్యలను వివరించారు... 



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలకు ముఖ్యంగా చెన్నై,ముంబై , హైదరాబాద్ మహా నగరాలు మెయిన్ గా నిలిచాయని సీఎం కేసీఆర్ తెలిపారు.తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని.. వీరిలో 16 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నారు. సినీ పరిశ్రమ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది కాబట్టి రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని కేసీఆర్ చెప్పారు. ఈ 40 వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు సహా సామాన్య ప్రజలకు అందించే అన్ని సదుపాయాలు కూడా వారికి వెంటనే అందేలా అన్నీ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. 



ఇటీవల లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న థియేటర్లు తెరుచుకున్న కూడా కొద్ది నెలల వరకు కరెంట్ బిల్లులను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ 9 శాతాన్ని రీఎంబర్స్‌మెంట్ చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. సినిమాలపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ మొత్తంగా 18 శాతం ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో 9 శాతం రాష్ట్ర జీఎస్టీ ఒకేసారి రీఎంబర్స్‌మెంట్ చేస్తారని అన్నారు.టికెట్లను వారి రేటును పూర్తిగా మీకే వదిలేస్తున్నాం అంటూ కేసీఆర్ అన్నారు.థియేటర్లు వచ్చే నెల నుంచి లేదా డిసెంబర్ నుంచి సంక్రాంతికి తెరుచుకోవడం అనే వారి ఇష్టానికి వదిలేస్తున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: