బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు.. అదేంటి మరో నెల రోజులు తర్వాత తేలే ఆ రిజల్ట్ ఇప్పుడే ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. కాని సోషల్ మీడియాలో హంగామ చూస్తుంటే ప్రస్తుతం విన్నర్ గా ఒకరి పేరు బాగా వినిపిస్తుంది. సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలుస్తాడని అందరు అంటున్నారు. సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. అయితే అభిజిత్ కు పోటీగా అఖిల్, సోహెల్ కూడా టైటిల్ రేసులో ఉన్నారు. మేకా పులి అంటూ అభిజిత్ తో అఖిల్ ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉంటాడు. మోనాల్ విషయంలో వీరిద్దరు దూరమై ఆ దూరం పెరుగుతూనే వచ్చింది.

మధ్యలో కలిసినట్టు అనిపించినా కూడా మళ్లీ నామినేషన్స్ టైం లో గొడవపడి విడిపోయారు. ఇదిలాఉంటే అభిజిత్, అఖిల్ లతో పాటుగా సోహెల్ కూడా గట్టి పొటీ ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అఖిల్ కన్నా సోహెల్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అఖిల్ ఫ్రెండ్ గా ఉంటూ అఖిల్ కు సపోర్ట్ చేస్తూ సోహెల్ కూడా బయట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మేకా పులి గొడవలతో అభిజిత్ ఫ్యాన్స్ అఖిల్ ను.. అఖిల్ ఫ్యాన్స్ అభిజిత్ ను బ్యాడ్ చేస్తున్నారు.

అయితే ఫైనల్ గా ఈ ఇద్దరు గొడవపడి విజేతగా సోహెల్ ను చేసేలా ఉన్నారని అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచేందుకు సోహెల్ కు ఛాన్సులు ఉన్నాయి. అతనే టాస్కుల్లో కూడా తన 100 పర్సెంట్ ఇచ్చాడు.. ఫిజికల్ టాస్కుల్లో కూడా సోహెల్ ఎప్పుడు సూపర్ అనిపించుకున్నాడు. సో అభిజిత్, సోహెల్ ఫైట్ లో సోహెల్ విజేతగా నిలిచే ఛాన్సులు కూడా ఉన్నాయని అంటున్నారు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: