బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం నామినేషన్స్ లో అవినాష్ కూడా ఉన్నాడు. అవినాష్ తో పాటుగా అరియానా, మోనాల్, అఖిల్ ఉన్నారు. అయితే అందరు ఈ వారం మోనాల్ తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని ఫిక్స్ అవుతున్నారు. అయితే హారిక, అభిజిత్ ఫ్యాన్స్ అఖిల్ ను బయటకు పంపించే ప్లాన్ చేసి మోనాల్ కు ఓట్ వేసే ఛాన్స్ ఉంది. అలా చేస్తే మాత్రం అవినాష్ హౌజ్ నుండి బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

జబర్దస్త్ షో నుండి క్రేజీ కంటెస్టంట్ గా వచ్చిన అవినాష్ హౌజ్ లో అందరి కన్నా బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచాడు. అతని కామెడీయే అతని బలం అయితే కొన్ని టాస్కుల్లో అతను మిగతా హౌజ్ మేట్స్ తో వాధిస్తున్నాడు. అలాంటి టైం లో అతను కొంత వారికి దూరమవుతున్నాడు. అవినాష్ కామెడీలో పర్ఫెక్ట్ అయితే అదే కామెడీ యాంగిల్ లో తన సిన్సియర్ ఎఫర్ట్ పెట్టేసి బాధ్యతని ఆడియెన్స్ మీదకు వదిలేస్తే వాళ్లు తప్పకుండా సేవ్ చేస్తారు.

ఇప్పటివరకు అవినాష్ ను సేఫ్ చేస్తూ వచ్చింది కూడా అలాంటి వారే. అయితే అవినాష్ ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయన్ చెప్పొచ్చు. ఎందుకంటే అభిజిత్, సోహెల్, అఖిల్ గట్టి పోటీ ఇస్తున్నారు. మైండ్ గేం లో అభిజిత్ ను.. ఫిజికల్ టాస్క్ లో సోహెల్, అఖిల్ ను గెలవలేని అవినాష్ సీజన్ 4 విన్నర్ గా నిలిచే ఛాన్స్ లేదు. అయినా సరే ఇప్పటికీ అవినాష్ తన కామెడీనే నమ్ముకుని ఆడియెన్స్ ను అలరిస్తే అతన్ని కూడా టాప్ 2లోకి తీసుకెళ్లే అవకాసం ఉంది. అంతేకాదు విజేతగా కూడా చేసినా చేస్తారు. సో అవినాష్ చేయాల్సిందల్లా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే బెటర్.       

మరింత సమాచారం తెలుసుకోండి: