యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ సరైన హిట్ లేదు. అలాంటి హీరో ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ వైపు ఆలోచనలు చేయడమే కాకుండా ప్రభాస్ లాంటి టాప్ హీరోకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన ‘ఛత్రపతి’ మూవీ పై కన్ను పడటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


రాజమౌళి ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ ఒకప్పుడు ట్రెండ్ సెటర్. ఆ మూవీని బాలీవుడ్ లో రీ మెక్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు కనీసం రాజమౌళికి కూడ రాలేదు. ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిన ప్రభాస్ తన తదుపరి మూవీగా ‘సాహో’ ని నిర్మించాడు కాని అతడి ఆలోచనలలో ఎప్పుడు ‘ఛత్రపతి’ రాలేదు.


యాక్షన్ సెంటిమెంట్ ఎమోషన్ లు కీలకంగా ఉండే ‘ఛత్రపతి’ మూవీ కథలో అనేక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈనాటి తరానికి నచ్చే విధంగా ఈ మూవీ కథలో ఎన్నో మార్పులు చేయాలి. అమ్మ సెంటిమెంట్ తో ఉండే కథలకు ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది అన్న విషయం వాస్తవమే అయినప్పటికీ ఈ మూవీ కథలో అనేక మార్పులు చేయవలసి ఉంది.


ఇప్పుడు ఆ బాధ్యతను రచయిత విజయేంద్ర ప్రసాద్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయేంద్ర ప్రసాద్ అందించే స్క్రిప్ట్ ఒక్క రాజమౌళి సినిమాలకు సూపర్ హిట్స్ అందించింది కాని బయట దర్శకులకు విజయేంద్ర ప్రసాద్ కథలు బాగా కలిసి వచ్చిన సందర్భాలు అతి తక్కువ. అయినప్పటికీ ఆ సెంటిమెంట్ ను పక్కకు పెట్టి బెల్లంకొండ శ్రీను విజయేంద్ర ప్రసాద్ ను నమ్ముకుంటున్నాడు. కాలానుగుణంగా ప్రస్తుత తరం అభిరుచులలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈమూవీ స్క్రిప్ట్ ను మార్చడం ఒక సమస్య అయితే ఈ మూవీ కథ ఇప్పటి తరానికి ఎంతవరకు నచ్చుతుంది అన్న సందేహాలు కూడ ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈమూవీని తీయాలి అంటే బెల్లంకొండకు ఒక క్రేజీ డైరెక్టర్ దొరకాలి. అయితే బెల్లంకొండను నమ్ముకుని సుజిత్ కూడ ముందుకు రావడం లేదు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ఈ మూవీకి దర్శకత్వం వహించే నాధుడు ఎవరు అన్నదే సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: