పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు లో వుండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆయన అభిమానులు ఆయనను దేవుడిలా కొలుస్తారు.అటువంటి ఆయన స్క్రీన్ పైన కనబడితే ఫాన్స్ చేసే హంగామా మామూలుగా వుండదు.ఒక్క పవర్ స్టార్ కంబడితేనే అంతా వుంటే మరి పవర్ స్టార్ డ్యుయల్ రోల్ ల్లో కనబడితే ఫాన్స్ కు పండగే.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కథలో పవన్ రెండు పాత్రల్లో కనిపించబోతునాడని సమాచారం.. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ అలాగే కొడుకు పాత్రలోనూ పవన్ కనిపిస్తాడట. కాగా ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు. 

ఎందుకంటే గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు.మరి పవన్ -హరీష్ కాంబో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: