ప్రముఖ తమిళ హాస్యనటుడు తవసి అనేక చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తవసి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, మధురైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఇటీవలే తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలంటూ ఆయన దీనంగా విజ్ఞప్తి చేశారు. తవసి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ ఓ వీడియోను విడుదల చేశారు. ఒకప్పుడు ఎంతో పుష్టిగా ఉన్న తవసి ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అత్యంత దయనీయంగా చిక్కిశల్యమైన స్థితిలో కనిపించారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆయనను చూసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆ వీడియోని చూసిన తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ సేతుపతి, రజినీకాంత్, శివకార్తికేయన్‌, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. అందులో భాగంగా హీరో శివకార్తికేయన్‌ తన ఫ్యాన్స్‌ అసోయేషన్‌తో రూ. 25వేల చెక్‌ను తవసి కుటుంబానికి అందించారు. తమిళ డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవనన్‌, తవసిని తన ఆసుపత్రిలో చేర్పించుకున్నాడు. అతడికి ఉచిత చికిత్స అందిస్తామని తెలిపాడు. మరోవైపు కమెడియన్‌ సూరీ రూ.20వేలు ఆర్థిక సాయం చేశారు. మక్కల్‌ సెల్వన్ విజయ్‌సేతుపతి లక్ష రూపాయలను తవసికి అందజేశాడు. అయితే దాతలు స్పందించే లోపే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్టకరం.

అయితే నాల్గవ స్టేజ్ క్యాన్సర్‌ తో బాధపడుతోన్న తవసి ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో నిన్న మరణించారు. దీంతో అయన మృతి పట్ల పలువురు సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. తవసి నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన వాటిలో ముఖ్యంగా ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. తవసి రజనీకాంత్ తాజా చిత్రం అన్నాత్తేలో కూడా నటించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: