బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షోకి గత రెండు సీజన్స్ నుండి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. యువసామ్రాట్ అక్కినేని నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వయసు మీదపడుతున్నా చెరగని అందంతో, హుందాతనంతో అందరినీ ఆకర్షిస్తాడు అక్కినేని నాగార్జున. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నఈ మన్మధుడు హోస్ట్ గా కూడా తన సత్తాను చాటుకుంటున్నారు.

ఇక ఆయన మాటల గారడి చూసే మళ్లీ బిగ్ బాస్ సీజన్ 4 కు హోస్ట్ గా తీసుకున్నారు. ఈ మన్మధుడిని చూసే చాలా మంది బిగ్ బాస్ చూస్తున్నారని చెప్పుకుంటారు. అయితే నాగార్జున ఎంత ఫన్నీగా ఉంటారో అంతే సీరియస్ గా కూడా వ్యవహరిస్తుంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల ప్రవర్తన పైనే నాగార్జున ఇలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇంటి సభ్యులు ఏదైనా తప్పు చేసినట్టైతే వారిని మందలించి, చురకలందించి వారిని సక్రమమైన దారిలోకి తీసుకురావడానికి నాగార్జున మందలిస్తుంటారు.

అయితే వారిని మాత్రం ఫన్నీగా ఉంచడంలో నాగార్జునకు మించిన వారు లేరని పిస్తుంటుంది. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా నాగార్జున కి బాగా తెలుసు. అయిలే హోస్ట్ నాగార్జునకి బిగ్ బాస్ ఇంట్లో ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా ఉన్నారట. మరి అదేవరో కాదండోయ్.. లైఫ్ ఈజ్ బ్యూటీవుల్ అంటూ నాగార్జున వైఫ్ అమల కొడుకులా నటించి అందరి అభిమానాన్నిసొంతం చేసుకున్న అభిజీతే నట.

ఇక ఈ సీజన్ 4లో అభిజీత్ అంటే అమలకు ఎంతో ఇష్టమట. అలాగే మన యువసామ్రాట్ నాగార్జునకు కూడా అభిజీత్ అంటే ఇష్టమేనట. అందుకే బిగ్ బాస్ ఇంట్లో అతనని మందలించి పర్ఫామెన్స్ బెస్ట్ గా ఇవ్వడానికి అలా చేశాడట. అలాగే ఈ మధ్యన నాగార్జున అభిజీత్ ను ప్రతి వారం డ్యాన్స్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే అభిజీత్ ను నాగార్జున ఎంకరేజ్ చేస్తుండటంతో అభి ఫైనల్ లో గెలుస్తాడు కాబట్టే నాగార్జున అభికి ఫేవరెట్ గా ఉంటున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: