చాలా మంది అబిమానులు ఫలానా డైరెక్టర్ తో తమ హీరో సినిమా తీస్తే బాగుంటుందని కోరుకుంటూ వుంటారు. వాటిలో భాగంగానే కొన్ని కాంబినేషన్స్ అంటే ఎనలేని క్రేజ్ ఏర్పడుతుంది. అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ మెగాస్టార్ చేరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరి అలాంటి దర్శకుడితోనే చిరు సినిమా కోసం ఎప్పటి నుంచో అంతా ఎదురు చూస్తున్నారు..

 వీరిద్దరి కాంబో నుంచి ఓ సినిమా ఉందని ఎప్పుడో ఫిక్సయిన సంగతి తెలిసిందే.దీనిని డి‌వి‌వి దానయ్య నిర్మిస్తాడని స్వయన చిరంజీవి 'వినయ విదేయ రామ' ఆడియో ఫంక్షన్ లో అధికారికంగా ప్రకటించాడు.  కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి ప్రస్తావనే లేదు.చిరు ఇప్పటికే మూడు సినిమాలను ప్రకటించిన ఎక్కడ త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావించ లేదు.

అలాగే త్రివిక్రమ్ కూడా తన తరువాతి సినిమాను ఎన్‌టి‌ఆర్ తో చేస్తున్నాడు.తరువాత మహేష్ తో చేసే అవకాశం వుంది.మరి చిరు త్రివిక్రమ్సినిమా ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. మరి వీరి కాంబో నుంచి సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: