బిగ్ బాస్ హౌజ్ లో ఎన్ని చిత్రాలో అలా  జరిగిపోతూంటాయి. ఆడియన్స్ తీర్పులు అని ఎంత చెప్పినా కూడా  అక్కడ బిగ్ బాస్ డైరెక్షన్ అన్నది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే ప్రతీదీ  జరిగిపోతూంటూంది. ఇక 12వ‌ వారం నామినేషన్స్ లో కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అది లక్ కి సంబంధించినది. గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీలలో ఎర్రని కలర్స్ వచ్చిన వారు నామినేట్ అయినట్లు, గ్రీన్ కలర్ వచ్చిన వారు సేవ్ అయినట్లుగా బిగ్ బాస్ టాస్క్ డిజైన్ చేశారు.

ఆ ప్రకారం చూస్తే సోయెల్, మోనాల్ ఇద్దరు గ్రీన్ కలర్స్ తో సేవ్ అయ్యారు. అఖిల్, అవినాష్, ఆరియానా, అభిజిత్  నామినేట్ అయ్యారు. ఆ తరువాత బిగ్ బాస్ స్వాప్ చేసుకునేందుకు ఒక అవకాశం ఇచ్చినా సోహెల్, మోనాల్ ఇద్దరూ తాము నామినేట్ కామని తెగేసి చెప్పారు. ఇక కెప్టెన్ హోదాలో హారికను డిసైడ్ చేయమంటే ఆమె మోనాల్ ని నామినేట్ చేసి అభిజిత్ ని సేవ్ చేసింది.

ఈ మొత్తం ప్రక్రియలో మోనాల్ కి లక్ కలసివచ్చినా కూడా చివరికి అడ్డంగా బుక్ అయిందని అంటున్నారు. ఆమె ఈసారి కూడా నామినేట్ కాకపోతే హ్యాపీగా పదమూడవ వారం వరకూ షోలో ఉంటుంది. అయితే ఆమె అనుకున్నట్లుగా సేవ్ అయినా కూడా హారిక ఇచ్చిన షాక్ తో మళ్ళీ నామినేట్ కావాల్సివచ్చింది. మరి ఆమెను ఈసారి జనాలు ఆదుకుంటారా లేక అంతా అనుకుంటున్నట్లుగా బిగ్ బాస్ సేవ్ చేస్తాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈసారి అందరూ స్ట్రాంగ్ క్యాడిడేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి మోనాల్ హౌజ్ నుంచి బయటకు వెళ్ళడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా మరో నాలుగు వారాలో బిగ్ బాస్ షో అయిపోవస్తున్న వేళ ఇక కంటెస్టెంట్లు ఎవరూ సేవ్ గేం ఆడడానికి రెడీగా లేరని తాజా పరిణామాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: