మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన విజయ్ దేవరకొండ.... ఎంతో కష్టపడి పైకొచ్చిన విషయం తెలిసిందే. ఈ హీరో స్లాంగ్ అంటే అందరికీ ఎంతో ప్రీతి... టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ ఇంత స్థాయికి ఎదిగినా, అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు... అంతే కష్టపడుతూ, అందరితో సరదాగా ఉంటూ, చేసే ప్రతి పని మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది, శ్రమిస్తే ఫలితం అదే దొరుకుతుంది... ఇలా చైతన్యపరిచే విధంగా అతని మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. అయితే ఇప్పుడు ఇదే ఫిలాసఫీని తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా వర్తిస్తుంది అన్నట్టు వదిలేశాడట మన రౌడీ స్టార్ విజయ్. సాధారణంగా ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుండి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అంటే... వారి సెటిల్ అయ్యేవరకు ఫుల్ సపోర్ట్ ఉండాల్సిందే...

 కానీ తన టాలెంట్ ని, కష్టాన్ని నమ్ముకునే విజయ్ మాత్రం ఇప్పుడు తమ్ముడికి కూడా అదే సలహా ఇచ్చాడని తెలుస్తోంది. తమ్ముడు ఆనంద్ దేవరకొండ కు ప్రతి పనిలోనూ ఎంతో సపోర్టివ్ గా ఉండే విజయ్... కెరియర్ విషయంలో మాత్రం మన కష్టమే మనకు ఫలితాన్నిస్తుందని చెప్పి...రెండవ సినిమాకే కష్టపడు అనే విధంగా వదిలేశాడు. ఆనంద్ దేవరకొండ మూవీ  "దొరసాని" మొదటి సినిమా కావడంతో దగ్గరుండి బాగా హెల్ప్ చేశాడు కానీ.... రెండవ సినిమా బాధ్యతను పూర్తిగా ఆనంద్ కే వదిలేశాడట... తన తమ్ముడు కూడా స్వయంగా అన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా లవర్ బాయ్ విజయ్ తన తమ్ముడి సినిమా చూసి ఎంతో సంతోషపడి... చిత్ర బృందంలోని లో ప్రతి ఒక్కరి పనితనాన్ని ప్రశంసించారు.

చిత్ర‌యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ తమ్ముడు గురించి ప్రస్తావిస్తూ.... కథలను ఎన్నుకునే విధానానికి నీకు హ్యాట్సాఫ్ ఇలాగే ముందుకు సాగు అన్నాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే... వర్ష పెద్ద కళ్ళతో చాలా క్యూట్ గా కనిపిస్తూ... బాగా నటించింది అని అన్నారు. ద‌ర్శకుడు వినోద్ అనంతోజు పనితీరు మరియు నటీనటులైన కొండ‌ల్ రావు, గోపాల్ చైత‌న్య‌, భాస్క‌ర్, దివ్య‌, త‌రుణ్ పర్ఫామెన్స్ అద్భుతం అంటూ ప్రశంసించారు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: