ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ 11 వారాలు పూర్తి చేసుకొని 12వ వారంలో అడుగుపెట్టింది. ఈ వారం ఇంటి కెప్టెన్ గా హారిక బాధ్యతలు తీసుకుంది. ఇక నిన్న జరిగిన నామినేషన్ లో కెప్టెన్ గా వున్న హారికకి బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చాడు.12వ వారం నామినేషన్స్ లో భాగంగా నామినేట్ అయినవారిని సేఫ్ అయిన వారిలోనుంచి ఒకరిని స్వాప్ చేసుకోవచ్చు. ఈ బాధ్యతని కెప్టెన్ అయిన కారణంగా హారికకి అప్పజెప్పాడు బిగ్ బాస్. నిజానికి ఇది కత్తిమీద సాములాంటింది. కానీ, హారిక చాలా జెన్యూన్ గా రీజన్స్ చెప్తూ మోనాల్ ని అభిజిత్ తో స్వాప్ చేసింది.సోహైల్ తో మాట్లాడుతూ ఫస్ట్ సీక్రెట్  హౌస్ నుంచి నువ్వు ఇక్కడి వరకూ రావడంలో నీ గేమ్ నాకు కనిపిస్తోంది.


నువ్వు చేసిన త్యాగాలు, స్నేహానికి  నువ్విచ్చిన విలువ వీటన్నింటిని చూస్తే నీ గ్రాఫ్ ఇప్పటివరకూ తగ్గలేదని చెప్పింది. అంతేకాదు, నువ్వు ఇంట్లో ఉండటానికి అనర్హుడివి అని చెప్పడానికి నాకు పాయింట్స్ దొరకట్లేదని చెప్పింది.అలాగే మోనాల్ తో మాట్లాడుతూ మొత్తంగా చూసుకుంటే  నీ గేమ్ గత కొద్దివారాలుగానే బాగుందని, ముందు కూడా బాగా ఆడావ్ కానీ నోటీస్ కి వచ్చింది మాత్రం గత మూడు వారల నుంచే అని చెప్పింది. అలాగే, నన్ను కెప్టెన్ చేసిన నిన్ను స్వాప్ చేయలంటే చాలా బాధగా ఉందని చెప్పింది.


ఇక  హారిక చాలా జెన్యూన్ రీజన్ చెప్పి మోనాల్ ని స్వాప్ చేసింది. ఇక్కడే హారిక మాట్లాడిన మాటలకి కన్విన్స్ అయ్యింది మోనాల్.అంతమంది మాట్లాడినా కన్విన్స్ అవ్వని మోనాల్ హారిక చెప్పిన కారణాలకి చల్లబడింది. సరైన వ్యక్తితో నన్ను స్వాప్ చేయమని అడిగింది. దీంతో హారిక అభిజిత్ తో స్వాప్ చేసింది. ఇక్కడే హారికకి ఇచ్చిన పవర్ ని సరిగ్గా ఉపయోగించుకుంది. ఇప్పుడు హారిక ఆడిన గేమ్ కి పాజిటివ్ గా స్పందిస్తున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. హారిక  నువ్వు చేసింది చాలా సరైన పని. అభిజిత్ ని నామినేషన్ నుంచి సేవ్ చేసి నీ ఫ్రెండ్షిప్ ఏంటో నిరూపించుకున్నావ్.


ఇన్నాళ్లు నిన్ను అభి కాపాడాడు ఇప్పుడు నువ్వు అభి రుణం తీర్చుకున్నావ్ అంటూ హారిక పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నీకెప్పుడు అభి ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. అని హారికకి మద్దతుగా బిగ్ బాస్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇక్కడ హారిక తీస్కున్న డెసీషన్ లో ఎలాంటి తప్పు లేదనిపించింది. అంతేకాదు, చాలామంది నెటిజన్స్ కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: