అల్లు అర్జున్ మెల్లమెల్లగా తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు.బన్నీ నుండి ఈ సంవత్సరం వచ్చిన 'అల వైకుంటపురంలో' సినిమా గట్టి పోటీ ఉన్నపటికి కూడా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురంలో” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి ఎంతటి  సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

. బాక్సాఫీస్ పరంగా దుమ్ము లేపిన ఈ చిత్రం మ్యూజికల్ పరంగా కూడా అంతే సంచలనాన్ని నమోదు చేసుకుంది.ఈ సినిమాకు థమన్ ఆందించిన పాటలు ఒక సంచలనమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా విజయంలో పాటలు కీ రోల్ పోసించాయి. "బుట్ట బొమ్మ" సాంగ్ అయితే ఇంటెర్నేషల్ వైడ్ అటెన్సన్ ను రప్పించుకుంది.

అలా ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్సమెన్ అయినటువంటి డేవిడ్ వార్నర్ కూడా ఈ సాంగ్ కు స్టెప్పేయడం ఆ టైం లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక అక్కడ నుంచి గత ఐపీఎల్ వరకు కూడా వార్నర్ మళ్ళీ పలు మార్లు స్టెప్పేయడం మనం చూశాం.అయితే ఇప్పుడు ఈ సాంగ్ మరో మైల్ స్టోన్ 450 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం పట్ల డేవిడ్ వార్నర్ బన్నీకు తన ఇన్స్టా ద్వారా వెల్డన్ అభినందనలు తెలిపాడు. దీనితో ఈ ఇద్దరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: