ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ సీజన్ 4 దాదాపు పూర్తవ్వబోతుంది. ఇంకో 4 వారాల్లో ఈ షో కి ఎండ్ కార్డు పడబోతోంది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్లో వున్న అందరి హౌస్ మెట్లలో మోనాల్ చాలా సెన్సిటివ్ అని అందరికి తెలుసు. బయట హీరోయిన్ గా మంచి పేరున్న కాని ఆమె ఏనాడు ఇగో చూపించకుండా చాలా సున్నితంగా ఉంటుంది. ఇక గత కొంత కాలం నుంచి చూస్తున్నట్లైతే  బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ అద్భుతంగా తన ఆటని కనబరుస్తుంది. మునుపెన్నడు చూపించని తెగువని చూపిస్తూ తనకోసం తను మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ గట్టిగా ఫైట్ చేసింది.


12వ వారం నామినేషన్స్ లో మోనాల్ తన మాటలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా అవినాష్ కి గట్టిగా సమాధానం చెప్పింది. అలాగే, తన ప్రియమైన స్నేహితుడు అఖిల్ కి కూడా సాలిడ్ కౌంటర్స్ తో గట్టి షాక్  ఇచ్చింది. మాటల తూటాలతో  అఖిల్ గుండెని తూట్లు పొడిచేసింది.ఇక నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బజర్ మోగగానే గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీలని ధరించమన్నాడు బిగ్ బాస్. దీంతో ఫస్ట్ అఖిల్, తర్వాత సోహైల్, అవినాష్, అరియానా , అభిజిత్ , మోనాల్ లు పరుగుపరుగున వెళ్లి టోపీలు  ధరించారు. అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.


క్యాప్స్ లో ఉన్న రెడ్ కలర్ తలమీద పడినవాళ్లు నామినేట్ అయ్యారని, గ్రీన్ కలర్ పడినవాళ్లు సేఫ్ అయ్యారని చెప్పాడు. ఇక్కడ నామినేట్ అయినవాల్లు శవపేటికలో ఉండి, తాము ఇంట్లో ఉండేందుకు ఎందుకు అర్హులో, బయట ఉన్నవాళ్లు ఎందుకు అనర్హులో చెప్పి స్వాప్ చేసుకోమని చెప్పాడు.ఈ క్రమంలో మోనాల్ అఖిల్ గురించి త్యాగం  చేస్తుందని అనుకున్నారు కానీ ఆ పని చేయలేదు మోనాల్. లాస్ట్ టైమ్ కలర్స్ టాస్క్ అప్పుడు ఇలాగే నామినేషన్స్ లో అఖిల్ మోనాల్ ఉంటే అప్పుడు అఖిల్ కోసం మోనాల్ నామినేట్ అయ్యింది. కానీ ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో నేను నా ప్లేస్ ని వదలను అని మాట్లాడింది.


 తర్వాత అఖిల్ కూడా ఎక్కడా తగ్గకుండా నేను స్వాప్ చేసుకోవాలి అని అనుకోవడం లేదని చెప్పాడు. ఇక్కడ అఖిల్ మోనాల్ తో కటాఫ్ చేస్కోవడానికి డిసైడ్ అయినట్లుగానే సోహైల్ తో చెప్పడం అనేది అఖిల్ ఆరాటాన్ని చూపిస్తే, మోనాల్ సోహైల్ తో అఖిల్ కి స్వాప్ చేయాలని ఉన్నా కూాడ నేను నాకోసం గేమ్ ఆడానని చెప్తూ తన పోరాటాన్ని చూపించింది.మోనాల్ చేసిన తగాదాకి ఇచ్చిన దెబ్బకి అఖిల్ కి మైండ్ బ్లాక్ అయి దిమ్మతిరిగి పొయ్యిందని  చెప్పాలి. దీంతో అంతా క్లియర్ అయ్యింది.


థ్యాంక్యూ సోమచ్ అంటూ మాట్లాడి ముక్తాయింపు ఇచ్చాడు అఖిల్.ఇక దీన్ని బట్టి చూస్తే ఈ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. ఇక వీళ్ళ ఫ్రెండ్ షిప్ కి శుభం కార్డు పడిపోయినట్లు కనిపిస్తుంది. చివరకి హారిక కెప్టెన్సీ పవర్ ని ఉపయోగించి మోనాల్ ని అభిజిత్ తో స్వాప్  చేసి మోనాల్ కి అఖిల్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: