టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ 350 కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. తేనె మనసులు సినిమా ద్వారా ప్రారంభమైన కృష్ణ సినీ జీవితం ఆ సినిమా విజయంతో వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ఆపై వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని హీరోగా మంచి సక్సెస్ లు అందుకుని కొనసాగిన కృష్ణ కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటించారు. జేమ్స్ బాండ్, కౌబాయ్, సాంఘిక, జానపద, పౌరాణిక ఇలా అన్ని రకాల సినిమాల్లో కూడా నటించిన కృష్ణ అప్పటి యువత మరియు మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ప్రేక్షకాదరణ కలిగి ఉన్న నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో రకాల కొత్త హంగులను అప్పట్లో పరిచయం చేసిన కృష్ణ పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ హీరోగా మారిన తరువాత కెరీర్ పరంగా  తండ్రి కృష్ణ కలిసి కేవలం రెండు సినిమాల్లోనే నటించారు. వాటిలో మహేష్ తొలి సినిమా రాజకుమారుడు లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో కృష్ణ కనిపిస్తారు, ఆ సినిమా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వచ్చిన వంశీ సినిమాలో మహేష్ కు మేనమామ పాత్రలో కృష్ణ కనిపిస్తారు. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీసు దగ్గర పరాజయం పాలైంది. ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరొకసారి వారిద్దరూ కలిసి నటించింది లేదు.

వంశీ సినిమా వచ్చి ఇప్పటికే దాదాపు 20 ఏళ్లు కావడంతో మరొకసారి ఈ సూపర్ స్టార్స్ ఇద్దరినీ కూడా ఒక సినిమాలో చూడాలని ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. అయితే ఇటీవల తన భార్య విజయనిర్మల మరణానంతరం మానసికంగా కొంత కుంగిపోయిన కృష్ణ ఎక్కువగా బయటికి రావడం లేదని తెలుస్తోంది. ఏవైనా ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటకు వస్తున్నారని అలానే అందుతున్న సమాచారాన్ని బట్టి ఇకపై ఆయన సినిమాల్లో నటించే అవకాశం కూడా చాలావరకు లేదని సమాచారం. మరి ఒక రకంగా ఇది నిజమే అయితే ఇకపై ఈ సూపర్ స్టార్స్ ఇద్దరినీ  కలిపి వెండితెరపై చూడటం కష్టమే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: