దర్శకుడు తరుణ్ భాస్కర్ మొదటి సినిమా పెళ్లి చూపులు. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం అందుకోవడమే కాకుండా, బెస్ట్ స్క్రీన్ ప్లే, మాటలకు తరుణ్ భాస్కర్‌కు అవార్డులు దక్కాయి. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్‌కే కాకుండా, హీరో దేవరకొండ విజయ్, హాస్యనటుడు ప్రియదర్శనికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో వారికి ఒకటేసారి గుర్తింపు వచ్చింది. పెళ్లి చూపులు అనంతరం వారు బాగా బిజీ అయ్యారనే చెప్పుకోవాలి.

ఆ తర్వాత తరుణ్ భాస్కర్ 2018లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తీశారు. ఈ సినిమాకు కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమా డైలాగులు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయనే చెప్పుకోవాలి. తరుణ్ భాస్కర్ తాను తీయనున్న మూడో సినిమా గురించి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. ఈ సినిమా పలు సమస్యలు తీసుకొని వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఆయన కూడా తన మూడో సినిమా గురించి పలు విషయాలు ఇన్‌స్టాలో చెప్పుకొచ్చారు. ఈ మూడో సినిమా తనను సమస్యల్లో పడేసిందని, ఈ సమస్యల వల్ల పూర్తిగా అసహనం చెందడమే కాకుండా తనను చంపేశాయన్నారు.

‘‘నా దగ్గర రెండు, మూడు ప్రాజెక్టులు చేతులో ఉన్నాయి. పెద్ద సమస్య ఏంటంటే అందులో ఒకటి ఎంచుకోవడం. నాకు ఇంతకు ముందు ఇలా లేదు. ఈసారే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నా. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ క్రైమ్ డ్రామాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. ఈ కథ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నాము. ఇందులో నేను అభిమానించే వ్యక్తితో కలిసి పని చేయనున్నాను. అదేంటో త్వరలోనే బయటపెడతాను. ఈసారి మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాశపరచను. దీనికోసం వేచి ఉండండి’’అని తరుణ్  రాసుకొచ్చాడు. ఇంకేం చేస్తాం? వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: