బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం నామినేషన్స్ లో ఊహించని విధంగా ట్విస్ట్ జరిగింది. రెండ్, గ్రీన్ క్యాప్ లతో బిగ్ బాస్ ఆడిన నామినేషన్ గేం లో అవినాష్, అరియానా, అఖిల్ డైరెక్ట్ నామినేట్ అవగా హారిక కెప్టెన్సీ పవర్ ను ఉపయోగించి అభిజిత్ ను సేఫ్ చేసి మోనాల్ ను నామినేట్ చేసింది. అయితే అంతకుముందే మోనాల్ ను కన్విన్స్ చేసే క్రమంలో అఖిల్, మోనాల్ ల మధ్య గొడవ జరిగింది.

రెండు వారాలుగా మోనాల్ తన సోలో గేం ఆడుతుంది. లాస్ట్ వీక్ కెప్టెన్సీ లో కూడా అఖిల్ కు సపోర్ట్ చేయలేదు. ఇక ఈ వారం నామినేషన్స్ లో కూడా అఖిల్ కు హ్యాండ్ ఇచ్చింది. ఈ టైం లో అఖిల్, మోనాల్ నువ్వేం చేశావ్ అంటే నువ్వేం చేశావ్ అనుకుంటూ వారి మధ్య దూరాన్ని పెంచుకున్నారు. ఇక హారిక మోనాల్ ను అభిజిత్ తో స్వాప్ చేస్తూ మోనాల్ కు ఎమోషనల్ గా దగ్గరవడానికి ట్రై చేసింది.

అయితే మోనాల్ ను హారిక స్వాప్ చేయడం.. అభిజిత్, హారికలు మోనాల్ ను ఓదార్చడం చూస్తుంటే.. వారిద్దరి ఫ్యాన్స్ కూడా మోనాల్ కు ఓట్లేసి సేఫ్ చేసినా చేసేస్తారని అంటున్నారు. అలా చేస్తే మాత్రం అవినాష్, అరియానా, అఖిల్ లలో ఒక స్ట్రాంగ్ కంటెస్టంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు సిసలు మజా వచ్చేలా ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. మోనాల్ తప్ప ఎవరి వెళ్లినా కూడా స్ట్రాంగ్ అనుకున్న వారు వెళ్లినట్టే. మోనాల్ కూడా ఈమధ్య తన ఆట తాను ఆడుతూ అలరిస్తుంది.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: