విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు డైరక్షన్ లో వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. అమేజాన్ ప్రైం లో ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు సెలబ్రిటీస్ సైతం ఈ సినిమా చూసి సూపర్ అనేస్తున్నారు.

మొదటి సినిమానే అయినా వినోద్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా చూసిన నితిన్ ఫిదా అయ్యాడని చెప్పాడు. ఇంతకీ నితిన్ ఏమని ట్వీట్ చేశాడంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ లవ్ లీ మూవీ.. హృదయాలను హత్తుకునేలా సినిమా ఉంది. నా నిర్మాత భవ్య క్రియేషన్స్ ఆనద్ ప్రసాద్ కు శుభాకాంక్షలు. సినిమాలో నటించవారంతా అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందించిన చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు నితిన్.

నితిన్ మాత్రమే కాదు తమ్ముడు సినిమాకు అన్న కూడా సూపర్ అనేశాడు. కష్టపడు ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అంటూ విజయ్ దేవరకొండ మెచ్చుకున్నాడు. అంతేకాదు సినిమాలో కొండల రావు పాత్ర చేసిన నటుడికి అవార్డ్ అందించాలని అన్నారు. మొత్తానికి ఆనంద్ దేవరకొండ తన ఖాతాలో ఒక హిట్టు కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ తన సినిమాలు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు.

                                                         
 

మరింత సమాచారం తెలుసుకోండి: