మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన యువర్ లైఫ్ అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఈ వెబ్సైట్ కోసం అక్కినేని కోడలు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే ఆమె తనకు తెలిసిన వంటకాలు జనానికి పరిచయం చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆమె స్థానంలో కి క్రేజీ హీరోయిన్ రష్మిక మందన ఎంటరైంది. ఈమె ఇప్పుడు గెస్ట్ ఎడిటర్ పాత్ర పోషిస్తూ రుచికరమైన ఆరోగ్యకరమైన పలు వంటలను పరిచయం చేస్తున్నారు. రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక అనే శీర్షికతో ఆమె తన వంటలను జనానికి పరిచయం చేస్తూ వీడియోలు చేస్తుంది.


 అందంగా ఉంటూనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈమె రకరకాల టిప్స్ చెబుతోంది. తాజాగా ఆమె చికెన్ పుట్టు కర్రీ ఎలా ఉండాలో చూపించి దాన్ని ఉపాసనకు రుచి చూపించింది. ఇంకేముంది అది తిన్న ఉపాసన రష్మిక నటిగానే కాదు షెఫ్ గా కూడా నెంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చింది. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మంచి వంట చేసి పెట్టే భార్య కోసం వెతుకుతుంటే దానికి రష్మిక బెస్ట్ ఆప్షన్ అంటూ ఆమె తెగ పొగిడేసింది ఉపాసన. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆమె ఈ వీడియోలో తన క్యాస్ట్ గురించి చెప్పుకొచ్చింది. తాను కర్ణాటకకు చెందిన కోర్నీ అనే ఒక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని అని చెప్పుకోవచ్చు. సాధారణంగా హీరోయిన్స్ తమ కులాన్ని బయట పెట్టడానికి ఇష్టపడరు.


 అలాంటిది ఈ భామ ఎందుకు చెప్పిందా అనుకుంటున్నారా.. ఉపాసన అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ ఆన్సర్ ఇచ్చింది. ఉపాసన రష్మిక ఉద్దేశిస్తూ కోడిని మీ భాషలో కోర్నీ అంటారట. అలానే మీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా పంది మాంసం తింటారు అంట కదా అని అడిగింది. దానికి ఏమాత్రం తడబడకుండా రష్మిక పంది మాంసం మా సంప్రదాయ వంటకం అని పందిని నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది. అంతేకాదు వైన్ తో కూడా తాము చాలా చేస్తామని ఒక రకంగా వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: