సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో వుండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ మహేష్ అభిమానుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడ అంతే స్థాయిలో ఫాలోవర్స్ వున్నారు.. అన్నిసోషల్ మీడియా మాధ్యమాల్లోనూ యాక్టివ్ గా ఉంటారాయన.

 ట్విట్టర్లో ఇప్పటికే 10 మిలియన్ మార్క్ దాటేసి 11 మిలియన్లకు చేరువలో ఉన్నారు. అదేవిదంగా ఇన్స్టాగ్రమ్ నందు కూడ హవా చూపిస్తున్నారు.తాజాగా ఆయన ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరింది.. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మహేష్ నిత్యం అభిమానులతో అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ తన అబిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటారు.

 ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రంలో ఆయన ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: