తమిళ డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన వర్ష బొల్లమ్మ తెలుగులో చూసీ చూడంగానే సినిమాతో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా సరే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈమధ్యనే అమ్మడు నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో సంధ్య పాత్రలో వర్ష చాలా బాగా నటించింది.

ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది వర్ష. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది వర్ష. క్యూట్ గా మనకు బాగా తెలిసిన అమ్మాయిగా అనిపించే వర్ష నిజంగానే తెలుగులో మరికొన్ని సినిమాలు చేసేలా ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మెప్పించిన అమ్మడు ఆ సినిమా హిట్ అవడంతో వరుస ఛాన్సులు పట్టేస్తుంది.

తెలుగులో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటుంది. అందుకే వర్ష బొల్లమ్మకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు. కోలీవుడ్ లో సైడ్ రోల్స్ చేస్తూ వస్తున్న అమ్మడికి తెలుగులో మాత్రం హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. చూస్తుంటే వర్ష తెలుగులోనే హీరోయిన్ గా సూపర్ గా సెటిల్ అయ్యేలా ఉంది. సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పిందట వర్ష. తెలుగు రాకపోయినా నేర్చుకుని మరి చేసిందంటే ఆమె సినిమా మీద ఉన్న కమిట్మెంట్ కు సూపర్ అనేస్తున్నారు.                                                                                
 

మరింత సమాచారం తెలుసుకోండి: