సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన కౌబాయ్ సినిమా టక్కరి దొంగ. 2002 జనవరి లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన రేంజి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో  మోసగాళ్లకు మోసగాడు సహా పలు కౌబాయ్ సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక అదే స్ఫూర్తితో మహేష్ చేసిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు కొంత నిరాశకు గురయ్యారని చెప్పాలి.

ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ అతి పెద్ద సంచలనం సృష్టించాయి. ఇకపోతే మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామలైన బిపాషా బసు, లిసారే జోడి కట్టిన ఈ సినిమాని తన సొంత బ్యానర్ అయిన జయంతి ఫల్క్రమ్ సినెర్జీస్ బ్యానర్ పై భారీ ఖర్చుతో దర్శకుడు జయంత్ నిర్మించడం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు జయంత్సినిమా గురించి మాట్లాడుతూ నిజానికి సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో కష్టపడ్డారని, గుర్రపు స్వారీ తో పాటు పలు ఇతర విద్యల్లో కూడా ఎంత ప్రత్యేక శిక్షణ తీసుకున్న మహేష్, ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని షాకింగ్ గా వెల్లడించారు.

నిజానికి కథా కథనాల పరంగా అలానే అక్కడక్కడా కొంత  యాక్షన్ సీన్స్ పరంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం మహేష్ పాత్ర పక్కన మంచి కమెడియన్ పాత్ర లేకపోవడమేనని అప్పట్లో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ను బాగా కోరుకునే వారిని, అలానే ఇటువంటి కథలకు ఆ టైపు క్యారెక్టర్స్ అవసరం అని అన్నారు. ఆ విధంగా మహేష్ పక్కన ఎవరైనా కమెడియన్ ని పెట్టి అతడితో మంచి పంచ్ డైలాగ్స్ పెట్టి ఉంటె సినిమా కొంత వరకు మంచి సక్సెస్ సాధించేదని జయంత్ అభిప్రాయపడటం జరిగింది. నిజానికి ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తాను కొంత నిరాశకు గురయ్యారని అయినప్పటికీ సినిమా ఫెయిల్యూర్ అనంతరం కూడా మహేష్ తనను ఎంతగానో ప్రోత్సహించారని జయంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: