తెలుగు చిత్ర పరిశ్రమలో తన అంద చెందాలతో మెప్పిస్తూ తనదైన శైలి దూసుకెళ్తుంది ఈ కనడ బ్యూటీ. కన్నడలో కిర్రిక్ పార్టీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రష్మిక. ఆ తరువాత అంజని పుత్ర, చమక్‌ చిత్రాల్లో నటించారు. ఇక ఛలోతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీత గోవిందంతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ ఏడాది మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్‌ భీష్మతో రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో బన్నీ పుష్ప, శర్వానంద్‌ ఆడోళ్లు మీకు జోహార్లులో నటిస్తుండగా.. తమిళంలో కార్తి సరసన సుల్తాన్‌లో నటించారు. అలాగే కన్నడలో ధృవ్‌ సర్జా హీరోగా పొగరులో నటిస్తున్నారు. అంతేకాదు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ సంవత్సరానికి గానూ నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక స్థానం సంపాదించుకున్నారు. నేషనల్‌ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. రష్మిక మందన్న పేరు కనిపిస్తోంది.

అయితే మెగా కోడలు కొణిదెల ఉపాసన స్టార్ట్ చేసిన ‘‘యువర్ లైఫ్’’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా ఉంటూ పలు రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. హెల్త్ గురించి తను ఏం ఫాలో అవుతుందో ఆడియన్స్ కు చెబుతూ, ఆరోగ్యకరమైన రెసిపీలను వండుతూ తన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తోంది.

తాజాగా చికెన్ తో ‘‘కోలీ పుట్టు’’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన, నటి గానే కాకుండా చెఫ్ గా కూడా రష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చింది. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదని,మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే..రష్మిక మంచి ఆప్షన్ అని ఫన్నీగా ప్రశంసించింది ఉపాసన కొనిదెల.

మరింత సమాచారం తెలుసుకోండి: