బిగ్ బాస్ సీజన్ ఫోర్ మరి కొద్ది రోజుల్లో ఫైనల్స్ కి చేరుకుంటోంది. దాంతో ఆట రసపట్టుగా సాగుతోంది. బిగ్ బాస్ కూడా టాస్కులు ఇంటెరెస్టింగ్ క్రియేట్ చేసేలా ఇస్తున్నాడు. హౌజ్ లో మొత్తం ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఇందులో రానున్న రెండు వారాల్లో ఇద్దరు హౌజ్ ని విడిచి పెట్టి ఎలిమినేట్ అవుతారు. దాంతో టాప్ ఫైవ్ ఎవరో తేలిపోతుంది.

ఇదిలా ఉంటే హౌజ్ లో అవినాష్ కి బిగ్ బాస్ ఒక అపురూపమైన  వరాన్నే ఇచ్చేశాడు. దాంతో అవినాష్ టాప్ ఫైవ్ లో చేరేందుకు అవకాశాలు గట్టిగా ఉన్నాయని అంటున్నారు. ఈ వారం నామినేషన్ లో ఉన్న అవినాష్ కనుక సేవ్ అయి బయటకు వస్తే మరో వారం అతను నామినేషన్ లో లేకుండా ఉండేందుకు ఒక అద్భుతమైన అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యులకు ఇచ్చిన ఒక టాస్క్ లో ఎక్కువ జెండాలు సేకరించి అఖిల్, అవినాష్ ఇద్దరూ పోటీదారులుగా ఉంటే అందులో అవినాష్ కి మెజారిటీ ఓట్లు పడ్డాయి.

దాంతో అవినాష్ నామినేషన్ ఒక వారం ఆపుకునే పాస్ సంపాదించాడు. అంటే అవినాష్ ఈ వారం కనుక సేవ్ అయితే మరో వారం కూడా హ్యాపీగా కంటిన్యూ అవుతాడు అన్న మాట. ఈలోగా ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అయితే మిగిలినది అయిదుగురే. దాంతో కచ్చితంగా టాప్ ఫైవ్ లో అవినాష్ ఉండేందుకు వీలు దొరుకుతుంది. మొత్తానికి చూసుకుంటే అవినాష్ టాప్ ఫైవ్ లోకి అతి చేరువలో ఉన్నాడు. కానీ అతను ఈ వారం సేవ్ అయితేనే ఇదంతా జరిగేది.

అందుకోసం ఇపుడు  జబర్దస్త్ టీం రంగంలోకి దిగిపోయింది. అవినాష్ ని టాప్ ఫైవ్ లో ఉంచే అతి కీలకమైన ఘట్టం కావడంతో ఈ వారం నామినేషన్ నుంచి అతన్ని బయటపడేసేందుకు గల అవకాశాలను జబర్దస్త్ టీం వెతుకుతోంది.  అవినాష్  కొరకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపడుతోంది. మొత్తానికి అవినాష్ కి వరం చేతిలో ఉంది. కానీ గండం కూడా పొంచి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: