బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఇపుడు జోరు పెరిగింది. అంతే కాదు టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంది. ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలుపుకుని మొత్తం పందొమ్మిది మంది ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో పన్నెండు మంది బయటకు వెళ్ళిపోయారు. మిగిలినది ఇపుడు ఏడుగురే. ఇందులో ఎవరి జాతకం ఏంటన్నది ఈ వారం తేలిపోతోంది.

ఈ వారం నామినేషన్స్ లో మోనాల్, అరియానా, అవినాష్, అఖిల్ ఉన్నారు. వీరి నలుగురిలో హౌజ్ నుంచి ఎవరి బయటకు వెళ్తారు అన్నది ఒక హాట్ హాట్ చర్చగా ఉంది. మామూలుగా అయితే మోనాల్ హౌజ్ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసేవారు గత మూడు వారాలుగా మోనాల్ గేమ్ బాగా ఆడుతోంది. టాస్కులు కూడా చేస్తోంది. అంతే కాదు, ఆమె తన పాయింట్ ని ఎదుటి వారికి పక్కా క్లారిటీగా చెబుతోంది.

ఇవన్నీ కూడా ఆడియన్స్ కి అట్రాక్ట్ చేసేవే. దాంతో ఆమె గ్రాఫ్ మెల్లగా పెరుగుతోంది ప్రతీ వారం ఆమె సేవ్ అవుతూ వస్తోంది. ఇక ఈ వారం ఆమెకు లక్ కలసివచ్చి సేవ్ అయినా కూడా బిగ్ బాస్ హారికకు బాధ్యతలు అప్పగించడంతో ఆమె స్వైపింగ్ చేసి అభిజిత్ ని రక్షించింది. ఇక ఇపుడు మోనాల్ మళ్ళీ నామినేషన్ లోకి వచ్చి ఆడియన్స్ తీర్పు కోరుతోంది.

అయితే మోనాల్ గేమ్  ప్లాన్ మారచడం, బాగా ఆడడమే కాదు, ఆమె అభిజిత్ ని సేవ్ చేయడం కూడా ఈసారి బాగా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. అభిజిత్ సైతం హౌజ్ లో ఆమెకు గట్టి సపోర్ట్ గా మారాడు. దాంతో మోనాల్ కి ఇపుడు అభిజిత్ ఫ్యాన్స్ ఫుల్ మద్దతు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హారిక ఫ్యాన్స్ మద్దతు ఆమెకే దక్కుతుంది అంటున్నారు.

 అదే జరిగితే మోనాల్ అందరి కంటే ముందే సేవ్ అయ్యే కంటెస్టెంట్ అని కూడా చెప్పాలి. ఇక అవినాష్ కోసం జబర్దస్త్ టీం రంగంలోకి దిగింది.  దాంతో అవినాష్ ని టాప్ ఫైవ్ లోకి పంపేందుకు వారు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బోల్డ్ గా ఉంటూ క్లారిటీగా గేం ఆడే అరియానాకు తన మద్దతు తనకు ఉంది. దాంతో ఇపుడు అఖిల్ పరిస్థితి ఏంటి అన్నది అర్ధం కావడంలేదు అన్న మాట వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో గత రెండు వారాలుగా అఖిల్ గేం ప్లాన్ కానీ ఆయన వైఖరి కానీ  చూస్తే గ్రాఫ్  ఒక్కసారిగా తగ్గిపోతోంది అనిపిస్తోంది.

తనకు ఎవరి సపోర్ట్ వద్దు అంటూనే కోరుకోవడం, అభిజిత్ మీద కోపం పెంచుకోవడం, మోనాల్ కి దూరం పెట్టడం వంటి వాటి వల్ల, అగ్రెస్సివ్ మూడ్ వల్ల అఖిల్  గ్రాఫ్ తగ్గుతోంది అంటున్నారు. అదే కనుక ఆడియన్స్ కి రీచ్ అయితే డేంజర్ జోన్ లో అఖిల్ కూడా ఉన్నట్లే లెక్క అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: