బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు లో జోరుగా సాగుతోంది. ఫైనల్స్ కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో పాతిక రోజుల్లో ఎవరు బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేత అవుతారు అన్నది తేలిపోనుంది. ఇదిలా ఉంటే సెలిబ్రిటీస్ కూడా ఈ షోను ఆసక్తిగా చూస్తున్నారు. తమ అభిప్రాయాల‌ను వారు మీడియా ముఖంగా పంచుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేత ఎవరు అవుతారు అన్నది కూడా చెప్పేస్తున్నారు.

తనకు ఈసారి షోలో ఇద్దరు హాట్ ఫావరేట్స్ ఉన్నారని నాగబాబు అంటున్నారు. వారిలో ఒకరు జబర్దస్త్ అవినాష్ అయితే మరొకరు అభిజిత్ అని నాగబాబు చెప్పేశారు. ఈ ఇద్దరిలో తనకు అత్యంత సన్నిహితుడు అవినాష్ అని అన్నారు. అవినాష్ జబర్దస్త్ ద్వారా తనకు బాగా క్లోజ్ అయ్యాడని, అతను ఏంటన్నది తనకు బాగా తెలుసు అని నాగబాబు అన్నారు.

అదే సమయంలో అభిజిత్ ఒక సినిమాలో నటించాడని, అతనికి మంచి ఫ్యూచర్ కూడా  ఉందని నాగబాబు అంటున్నారు. తాను ఒకటి రెండు సార్లు అభిజిత్ ని బయట కలిసాను అని కూడా చెబుతున్నారు. అభిజిత్ మంచి మనసు ఉన్న వాడని, అతను గెలిస్తే తాను చాలా సంతోషిస్తాను అని నాగబాబు అంటున్నారు.

ఈ ఇద్దరికీ తన అభిమానులు పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా నాగబాబు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే అవినాష్ ఎమోషన్స్ ని బాగా కంట్రోల్ లో ఉంచుతాడని, అయితే బిగ్ బాస్ హౌజ్ లో కొన్ని పరిస్థితుల కారణంగానే అతను ఎమోషన్ అవుతున్నాడేమోనని నాగబాబు అంటున్నారు. మొత్తానికి మెగా బ్రదర్ సపోర్ట్ దొరికిన ఈ కంటెస్టెంట్లు ఇద్దరూ కూడా బిగ్ బాస్ లో ఫైనల్స్ దాకా వెళ్లాలని అంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి హౌజ్ లో పరిస్థితి చూస్తే ఈ ఇద్దరూ కూడా టాప్ ఫైవ్ లోకి వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి టాప్ త్రీలోకి వీరు వస్తారా అన్నది చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: