నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దానికి సంబందించిన మూవీ టైటిల్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది .. అంటే సుందరానికి అనే చిత్రం తో నేచురల్ స్టార్ నాని రాబోతున్నారు ..ఇందులో నాని కి సరసన మలయాళీ భామ నాజ్రియా నటించబోతుంది .. మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని తో జతకట్టడం తో మంచి సినిమాని మనం చూడొచ్చు ..అలాగే అటువంటి సినిమాలలో సన్నివేశాలు కూడా అంటే  బాగుంటాయని అనుకోవచ్చు ..


అయితే నాని అంటే సుందరానికి అంటే చిత్రం యొక్క కథ బయటికి వచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి .. ఒకసారి ఆ కథని చుస్తే , ఒక బ్రాహ్మణ అబ్బాయికి,మరియు ఒక  క్రిష్టియన్ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథ అని తెలుస్తుంది . ..బ్రాహ్మణ అబ్బాయి అయినా నాని ప్రేమించిన అమ్మాయిని కూడా బ్రాహ్మణురాలిగా మార్చే ప్రయత్నం లో హీరో ఎలాంటి  అవస్థలు పడ్డాడు అంతేకాదు బ్రాహ్మణుల  యాస ,పద్ధుతులు మరియు సంప్రదాయాలు హీరోయిన్ కి నేర్పడం లో హీరో  చాలా కష్టాలు పడతాడట ఇలా నేర్పించే క్రమంలో సినిమాలో ఫుల్ కామెడి సన్నివేశాలు  ఉండవచ్చని అంటున్నారు .. ఇలా కథ  ఉంటుందని మాత్రమే కొందరు అంచనా వేస్తున్నారు .. ఇంతకీ అంటే సుందరానికి అనే  కథ ఎలా ఉండబోతుందనేది  తెలియాలంటే  మనం మూవీ ట్రైలర్ విడుదల అయ్యే వరకు ఎదురుచూడాలి ...


నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే చిత్రం తో బిజీగా వున్నారు దీని దర్శకుడు శివ నిర్వాణ... ఆ తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ అనే మరో సినిమాలో నటిస్తారు ..అది పూర్తయ్యాకే నాని అంటే సుందరానికి చిత్రం మొదలెట్టనున్నారు .. నాని కథల ఎంపికలో చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు .. అంటే సుందరానికి అనే టైటిల్ వింతగా ఉంది .ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో ...  

మరింత సమాచారం తెలుసుకోండి: