రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాలతో భారీ విజయాలు అందుకుని బడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి సహజత్వ నటన కనబరిచిన ప్రభాస్ పై పలువురు ప్రేక్షకులు అలానే విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం ప్రభాస్ నటించిన సినిమా సాహో. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


అయితే ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. దానితో ఎట్టిపరిస్థితుల్లో తదుపరి సినిమాతో సక్సెస్ సాధించాలనే కసితో ఉన్న ప్రభాస్ తదుపరి రాధేశ్యామ్ సినిమాతో యువ దర్శకుడు రాధాకృష్ణకి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. అతి త్వరలో ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఎంతో భారీ లెవల్లో ప్రారంభం కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. దీనికి యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ అనంతరం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో ప్రభాస్ నటించనున్న సినిమా ఆదిపురుష్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణాసురుడి పాత్ర పోషించనున్నారు.
కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక ఫిజికల్ ట్రైనర్ తో పాటు ఒక డైటీషియన్ ని కూడా ప్రభాస్ ప్రత్యేకంగా నియమించుకొని వారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ప్రభాస్ పలు నియమాలు పాటిస్తూ బాడీ బిల్డప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్న ఒక సందర్భంలో ప్రభాస్ దిగిన ఫోటోలు ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఫ్యాన్స్ ని అలానే ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలో ప్రభాస్ కొంత స్లిమ్ గా మంచి బాడీతో కనిపిస్తున్నారు. దానిని బట్టి చూస్తే ఆదిపురుష్ లోని రాముడి పాత్ర కోసం ఆయన ఎంతో ఫిట్ గా తయారవుతున్నట్లు తెలుస్తోందని ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని కెరీర్ లో ప్రభాస్ కి మరింత గొప్పపేరు తెచ్చిపెడుతుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: