లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు కుదేలయినట్టుగానే సినిమా పరిశ్రమ కూడా ఈ ఎఫెక్ట్ ను ఏమాత్రం తట్టుకోలేకపోయింది.. అప్పటికే రెడీ గా ఉన్న సినిమాలు అయితే ఆ లాస్ ని ఎలా భర్తీ చేసుకోవాలో తెలీక తలలు పట్టుకున్నాయి. కానీ OTT వారి సినిమాలకు వరంగా మారాయని చెప్పొచ్చు.. చాల సినిమాలు వెయిట్ చేయలేక తమ సినిమాలను OTT లకు మంచి ధరలకు ఆమ్ముకున్నారు.. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.. అయితే వాటికీ ఎఫెక్ట్ బాగానే ఉందని చెప్పొచ్చు. అలా  లాక్ డౌన్ కారణంగా బాగా ఎఫెక్ట్ అయినా తెలుగు సినిమాలు అంటే అఖిల్ నటించిన మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా, సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్, నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ, వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలు..

ఇవి కరోనా లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి సిద్ధం కావడంతో అందరి నోళ్ళలో ఈ సినిమాలు నాని నాని ఇప్పుడు పాతవిగా కనిపిస్తున్నాయి.. అక్కినేని వారసుల సినిమాలు  ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. రకరకాల కారణాల వల్ల లాక్ డౌన్ కు ముందే కొంత లేట్ అయిన ఈ బ్రదర్స్ మూవీస్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చేశాయి. బ్యాచిలర్ ని సంక్రాంతి కానుక అని ప్రకటించారు కానీ ఆలోగా ఏమైనా మార్పు జరిగినా ఆశ్చర్యం లేదు.

కానీ లవ్ స్టోరీకి సంబంధించి పోస్టర్లు వదలడం తప్ప ఇంకెలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఇక మెగా అల్లుళ్ళ బ్రదర్స్ కూడా తమ సినిమాలను రిలీజ్ చెస్ పనిలో ఉన్నారు. సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటరూ డిసెంబర్ అని చెప్పేశారు కానీ క్రిస్మస్ కన్నా ముందు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.. వైష్ణవ్ తేజ్ థన్ డెబ్యూ మూవీ ఉప్పెనతో పాటు క్రిష్ దర్శకత్వంలో చేసిన ఇంకో సినిమాను కూడా పూర్తి చేశాడు. ఇంకో నెలలో రెండు కాపీలు రెడీ అయిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: