బిగ్ బాస్ హౌజ్ ఒక ప్రపంచం. అక్కడ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఉన్న వారికి దూరంగా ఎక్కడో తెలియని వారి మధ్యన కలసి ఉండడం ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు మరో ఎత్తు.  ఇక హౌస్ లో కంటెస్టెంట్ల మధ్యన వచ్చే విభేదాలు గొడవలు మరో ఎత్తు. ఇలా చూసుకుంటే ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయో, ఎపుడు బాధ కలుగుతుందో ఎవరికీ తెలియదు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి తన ఎమోషన్స్ ని దాచి పెట్టుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్నాడు అభిజిత్. అభిజిత్ ఎక్కడ గొడవపడడం కానీ అరవడం కానీ చేయలేదు. హౌజ్ లో అందరితోనూ ఉంటున్నట్లే ఉంటూ తన పని తాను చేసుకోవడం, తన గేమ్ తాను ఆడుకోవడం అభిజిత్ విధానంగా ఉంది.

హౌజ్ లో తనతో సన్నిహితంగా ఉన్న వారు ఎలిమినేట్ అయి వెళ్ళిపోయినా కూడా తన ఎమోషన్స్ ని అభిజిత్ కంట్రోల్ లో పెట్టుకున్న తీరు కూడా ఆడియన్స్ కి నచ్చింది. ఇక మరో వైపు హౌజ్ మేట్స్ అతనితో గొడవ పడినా కూడా లైట్ గా తీసుకుని వివాదాన్ని ముగించడమూ అభిజిత్ టాలెంట్ గా ఉంటూ వచ్చింది.

అటువంటి అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లో తొలిసారి ఏడ్చాడు. బాధ పడ్డాడు. దాంతో మిగిలిన కంటెస్టెంట్స్ వచ్చి అతన్ని ఓదార్చడం జరిగింది. ఇంతకీ ఎందుకు అలా జరిగింది అంటే బిగ్ బాస్ హౌజ్ లో బిగ్ బాస్ అభిజిత్ ని అఖిల్ కి ఒక టాస్క్ ఇచ్చాచు. అదేంటి క్విజ్ కి జవాబు చెప్పి ఎవరు మోనాల్ తో డేట్ చేసే చాన్స్ సంపాదిస్తారా అన్నది టాస్క్.

దీని మీద తెగ బాధపడిన అభిజిత్ తాను ఈ టాస్క్ చేయనే చేయనని బిగ్ బాస్ కి చెప్పెశాడు. అసలు ఎందుకు ఇలా అవుతోంది అని కూడా హారికతో చెప్పుకుని బాధపడ్డాడు బిగ్ బాస్ హౌజ్ లో మోనాల్ తో అంటీ ముట్టనట్లుగా అభిజిత్ ఉంటూ వస్తున్నాడు. ఇపుడు ఒక్కసారి ఇలా పోటీ పెట్టడం పైన అభిజిత్ ఆవేశపడడమే కాదు, ముఖం దాచుకుని మరీ ఏడ్చాడు. ఆ సమయంలో అతన్ని హారిక సోహెల్ ఓదార్చడంతో మళ్ళీ మామూలు అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: