బిగ్ బాస్ సీజన్ ఫోర్ కధ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఈసారి విన్నర్ ఎవరు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. అందరూ కొత్తవారే ఈసారి వచ్చారు. దాంతో ఫ్రెష్ నెస్ బాగా హౌజ్ లో కనిపించింది. అదే టైంలో ఎవరి టాలెంట్ ని వారు ప్రూవ్ చేసుకుని మరీ సత్తా చాటారు. మెల్లగా ఆడియన్స్  మైండ్ లో రిజిస్టర్ అయ్యారు.

ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ విజేత కచ్చితంగా అభిజిత్ అని అంతా అంటున్నారు. గత కొన్ని రోజులుగా అభిజిత్ విన్నర్ అనే వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా అభిజిత్ కి గట్టి పోటీ ఇస్తూ సోహెల్ రేసులోకి వచ్చెశాడు. సోహెల్ లో అన్ని రకాల టాలెంట్ ఇపుడు బయటపడుతోంది. అతనిలో పక్కా మాస్ ఉన్నాడు. కామెడీ పంచులు వేస్తాడు. ఫిజికల్ టాస్కులు బాగా చేస్తాడు,  స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎమోషన్స్ ఉన్నాయి.

అందరితోనూ సరదాగా ఉంటూ మొత్తం హౌజ్ కి సెంటర్ అట్రాక్షన్ అయ్యాడు. సోహెల్ మొదట్లో అతిగా ఆవేశపడేవాడు. దాంతో అతను ఏదో ఒక వారం ఎలిమినేట్ అవుతాడు అని అని అంతా అనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో హోస్ట్ నాగార్జున కోపం తగ్గించుకోమని చెప్పడం, దాన్ని కచ్చితంగా సోహెల్ పాటించంతో మెల్లగా స్ట్రాంగ్ అవుతూ వచ్చాడు.

ఇపుడు మరో నాలుగు వారాలు మాత్రమే ఫినాలేకి టైం ఉంది అనగానే సోహెల్ ఒక్కసారి అనూహ్యంగా తన గ్రాఫ్ పెంచేసుకున్నాడు. బయట ఫ్యాన్స్ కూడా బాగా తయారయ్యారని అంటున్నారు. వేరే కధ ఉంటుంది.  ఏంటి పంచాయతీ అంటూ సోహెల్ చెబుతున్న డైలాగ్స్ బయట మారుమోగి యూత్ ఫుల్ గా కనెక్ట్ అవుతున్నారు.

సోహెల్ హౌజ్ మొత్తం లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల కూడా అతనికి ప్లస్ అవుతోంది. హౌజ్ లో సోహెల్ యాక్టివ్ నెస్ తోనే స్క్రీన్ షేర్ అంతలా తీసుకుంటున్నాడు అంటున్నారు. మొత్తానికి అభిజిత్ క్లాస్ అయితే సోహెల్ మాస్. ఈ ఇద్దరి మధ్యనే ఫైనల్స్ కి పెద్ద పోటీ ఉంది. సోహెల్ రన్నర్ అన్న వారు కూడా ఇపుడు విన్నర్ అవుతాడు అనేస్తున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: