మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈ మధ్య అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుతూ సందడి చేస్తున్న   సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరో టాపిక్ గురించి మాట్లాడుతూ.... తన గారాల కూతురు నిహారిక కు సంబంధించిన క్యూట్ మూమెంట్ ను ఎగ్జాంపుల్ గా వివరించారు మెగా ఇంటి సభ్యుడు నాగబాబు. పరిస్థితిని అర్థమయ్యేలా వివరించాలి అన్నా, మనసులోని మాట అవతలి వ్యక్తికి సూటిగా చేరాలన్నా, మనస్పర్ధలు లేకుండా విషయం అర్థం కావాలన్నా కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. ఈ కమ్యూనికేషన్ ప్రాముఖ్యత  టాపిక్ ను వివరించే సందర్భంలో తన క్యూట్ ఏంజెల్ నిహారిక స్కూల్ ట్రిప్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు నాగబాబు.

అదేంటంటే...! నిహారిక 10వ తరగతి చదువుతున్న సమయంలో ఉత్తరాంచల్ ట్రిప్ కు  స్కూల్ వారందరితో కలిసి నేను కూడా వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి నాన్న అంటూ నా దగ్గరకు వచ్చింది. కానీ అంత దూరం, అందులోనూ ఆ ట్రిప్ పది రోజులు కావడంతో అస్సలు ఒప్పుకోలేదు. అయినా తను నాలుగైదు రోజులు రిక్వస్ట్ చేస్తూనే వచ్చింది... ఒప్పుకుంటాను కానీ నీతో పాటు ఇద్దరు బాడీగార్డులను కూడా పంపుతాను వాళ్లు నీకు దూరంగా ఉంటూ ప్రొటెక్ట్ చేస్తారు. ఇది నీకు ఓకే అయితే నిన్ను ట్రిప్ కు పంపడానికి నాకు కూడా ఓకే అన్నాను. కానీ తను అందుకు ఒప్పుకోలేదు అలాగని తన ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాలని అనుకోలేదు. ఒకరోజు ట్రిప్ గురించి ప్లీజ్ నాన్నా అంటూ నన్ను కన్విన్స్ చేస్తూ లెటర్ రాసింది. ఆ లెటర్ రాసిన విధానం నాకు ఎంతగానో నచ్చింది... వెంటనే నిహారిక స్కూల్ ట్రిప్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అన్నారు నాగబాబు.

ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే... ఈ ట్రిప్ కు నా స్నేహితులతో కలసి వెళ్లాలని ఉంది. మీకు నా టీచర్ల నెంబర్స్ ఇస్తాను.. స్నేహితుల నెంబర్స్ కూడా ఇస్తాను... ప్రతి రోజు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయి. సిగ్నల్ ఉన్నా లేకున్నా నేను నీకు ప్రతి రోజు కాల్ చేసి ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో చెప్తాను. ప్లీజ్ నాన్న ట్రిప్ కి వెళ్లనివ్వు అంటూ రాసింది. తను నన్ను కమ్యూనికేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చిందని నాగబాబు పేర్కొన్నాడు. ఒకవేళ  నిహారిక ఆ రోజు  అలా కమ్యూనికేట్ చేయకుంటే నేను ఒప్పుకునే వాడిని కాదు.. తను తన ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో ఆ మంచి మూమెంట్స్ మిస్ అయ్యేది అంటూ నాగబాబు కమ్యూనికేషన్ యొక్క  ప్రాముఖ్యతను గురించి చెప్పుకొచ్చారు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఎంత కీలకమో ఈ ఉదాహరణ వివరించాడు మెగా బ్రదర్.

మరింత సమాచారం తెలుసుకోండి: