తమిళ హీరో సూర్య తన నటనతో అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ అభిమానుల సైన్యాన్ని పెంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్స్  అందుకున్న ఈ హీరో కి గత కొంత కాలంగా ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. అయితే ఎట్టకేలకు మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ బడా హీరో. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో  సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇటీవల ఓటీటీ లో విడుదలై  సాలిడ్ హిట్ ను అందుకుంది. ప్రేక్షకుల అభిమానాన్ని మూటగట్టుకొని మురిసిపోతున్నారు మన హీరో సూర్య. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్య పాండి రాజ్ దర్శకత్వంలో చేయడానికి ఇప్పటికే ఫిక్స్ కాగా... ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో వినూత్నంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో సూర్య సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై పలు అగ్ర కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి... ఆఖరికి స్టార్ హీరోయిన్ రష్మిక ను ఎంపిక చేసినట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. కాగా  ఈ వార్తలపై స్పందించి  విషయాన్ని స్పష్టం చేశారు దర్శకుడు పాండి రాజ్ . నిజానికి ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఏ హీరోయిన్ ను ఎంపిక చేయలేదని మా కథలో కథానాయక పాత్రకు సరిగ్గా సూటయ్యే హీరోయిన్ కోసం చర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు... హీరోయిన్ ను ఎంపిక చేసిన వెంటనే ఆదికారికంగా ప్రకటిస్తాం . ఇప్పటివరకు జరిగిన ప్రచారం అంతా అవాస్తవం అందులో నిజం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు.

మరి ఈ సినిమాలో సూర్య పక్కన చోటు దక్కించుకునే లక్కీ గర్ల్ ఎవరన్నది మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్రం దర్శకుడు ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయలేదు అన్నారు కానీ... రష్మిక ను కచ్చితంగా సెలెక్ట్ చేయము అనలేదు కదా...కాబట్టి సూర్య పక్కన చాన్స్ కొట్టే అవకాశం రష్మిక కు వస్తే బాగుండు అంటూ ఆకాంక్షిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఇంతకీ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది త్వరలో రివీల్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: