పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తక్కువ. కానీ క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. చిరంజీవి 150 సినిమాల్లో సాధించిన ఇమేజ్ ని తక్కువ సినిమాలతో మ్యాచ్ చేసిన రికార్డ్ పవన్ కళ్యాణ్ దే. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి ముందు ఒక సినిమా చేస్తే కనీసం ఏడాది పట్టేది. కానీ రీ ఎంట్రీ తరువాత జోరు పెంచారు. వరసగా అయిదారు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.

ఇక వకీల్ సాబ్ రెడీ అవుతోంది. ఆ వెంటనే అయ్యప్పనుం కోషియం సెట్స్ మీదకు వెళ్తోంది. ఆ తరువాత క్రిష్ మూవీ ఉంది. దాంతో పాటే హరీష్ శంకర్ మూవీ ఆ మీదట సురేందర్ రెడ్డి మూవీస్ ఉన్నాయి. ఇంకా మరో ఒకటి రెండు మూవీస్ విషయంలో కూడా డిస్కషన్ జరుగుతోందని తెలుస్తోంది.

ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గా లాగించేయాలని పవన్ కండిషన్ పెట్టి మరీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అంటే కచ్చితంగా రెండేళ్ల వ్యవధిలో ఈ మూవీస్ అన్నీ థియేటర్లో సందడి చేస్తాయన్నమాట. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం తన కెరీర్ లో తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు అన్న టాక్ ఉందిపుడు.

ఆయనకు నచ్చిన, ఆయన మెచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లోనే ఈ రేర్ ఫీట్ చేస్తున్నాడు అంటున్నారు. పవన్ తండ్రీ కొడుకులు అని ఊహించుకోగానే ఫ్యాన్స్ ఎక్కడికో వెళ్లిపోతారు. నిజానికి ఇది టఫ్ జాబ్, తండ్రీ, కొడుకు అంటే రెండు తరాల మధ్య వేరియేషన్ చూపించాలి. దాంతో ఆటు నటనకు స్కోప్ ఉంటుంది. ఇటు కొడుకు పాత్రలో యూత్ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఉంటుంది. దంతో పవన్ లోని ఆ మ్యాజిక్ ని  బయటకు తీయడానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ రెడీ అయ్యాడని అంటున్నారు. అనుకున్నదే నిజం అయితే మాత్రం ఈ మూవీ రిలీజ్ కాక ముందే రికార్డులు బద్దలు అని కచ్చితంగా చెప్పేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: