సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక మాయాజాలం. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. ఎంతో బ్యాగ్ గ్రౌండ్ ఉంటె కానీ మొదటి అవకాశం రాదు. అందం, నటన వంటి నైపుణ్యాలు ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే ఈ ఇండస్ట్రీలో మనుగడ కష్టం అవుతుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారంతా పెద్దయ్యాక హీరో లేదా హీరోయిన్ అవ్వాలని కలలు కంటారు. కానీ అవకాశాలు మాత్రం అరుదుగానే ఉంటాయి. అలా అదృష్టం తలుపు తట్టి త్వరలోనే హీరోయిన్ కాబోతున్న చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖ సురేంద్రన్. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన అనిఖ ఇప్పడు హీరోయిన్ తెరంగేట్రం చేయబోతుంది.


అనిఖ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. హీరో అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ సినిమాలో బాలనటిగా అద్భుతమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాగా అనిఖ కి మంచి పేరు లభించింది. అజిత్ అనిఖ ను తన సొంత కూతురిలా భావిస్తారు. కేరళ రాష్ట్రం నుండి ఎన్నో అవార్డ్స్ ని అందుకున్న అనిఖ దివంగత సీఎం జయలలిత బయోపిక్ లో చిన్నప్పటి జయలలిత పాత్రలో ఎంతో చక్కగా నటించింది.


తెలుగులోనే మొదట హీరోయిన్ గా


అనిఖ హీరోయిన్ గా మొదట నటించే అవకాశం తెలుగులోనే రావడం విశేషం. మలయాళంలో సూపర్ హిట్ అయిన కప్పెల అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి అనిఖ కి అవకాశం లభించింది. నవీన్ చంద్ర, విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా నటిస్తున్న కప్పెల చిత్రంలో అనిఖ ఎలా నటిస్తుందో చూడాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాలి. ఇక కప్పెల సినిమాకు దర్శకత్వం చేయబోతుంది ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానేర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: