బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారానికి వచ్చేసరికి కేవలం ఏడుగురు హౌజ్ మేట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో టాప్ 5 ఎవరు ఉంటారన్నది ఇప్పటికే చాలామంది లెక్కలేసి చెబుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో విజేతగా నిలిచే అవకాశం ఉన్న వారిలో సోషల్ మీడియాలో వినిపించే మొదటి పేరు అభిజిత్. రెండు సినిమాలు తీసిన హీరోగా పెద్దగా పరిచయం లేకపోయినా బిగ్ బాస్ లో ఇచ్చిన ప్రతి టాస్క్ మైండ్ గేం తో ఆడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు అభిజిత్. విజేతగా నిలిచేందుకు దాదాపు అన్ని అర్హతలు ఉన్నవాడే అని చెప్పొచ్చు.

ఇక ఆ తర్వాత సోహెల్, అఖిల్ కూడా తర్వాత రేసులో ఉన్నారు. వారు కూడా విన్నర్ గా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అయితే అభిజిత్ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మరో కంటెస్టంట్ అరియానా గ్లోరీ. ఆమె హౌజ్ లోకి వచ్చేప్పుడు ఎవరో తెలియదు ఏదో రెండు మూడు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ తప్ప పెద్దగా పరిచయం లేదు కాని బిగ్ బాస్ ఆడియెన్స్ కు అరియానా బాగా నచ్చేసింది. ఆమె బోల్డ్ నెస్ కు అందరు ఫిదా అవుతున్నారు.

బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూస్ ఇస్తున్న ప్రతి యూట్యూబ్ ఛానెల్ కామెంట్స్ లో అరియానాకే ఎక్కువ సపోర్ట్ గా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అభిజిత్ తర్వాత ఓ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది ఎవరు అంటే అరియానా అని చెప్పొచ్చు. చూడటానికి బక్కగా ఉంటుంది కాని ఆట మాత్రం ఓ రేంజ్ లో ఆడుతుంది. మొత్తానికి అరియానా కూడా టాప్ లో ఉండేందుకు తీవ్ర కృషి చేస్తుందని చెప్పొచ్చు.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: