ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చిత్ర పరిశ్రమపై ఆగ్రహించడం కొత్తేం కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగన.. బాలీవుడ్‌లోని బడాబాబులను విమర్శిస్తూ తరచుగా పోస్టులు పెడుతుంటారు. ఈ రోజు కూడా ఆమె అలాంటి
ట్వీట్లే చేశారు. బాలీవుడ్ కేవలం 4 కుటుంబాలదే కాదని మరోసారి రుజువైందని, బాలీవుడ్ బడాబాబులు ఇది మంచి గుణపాఠమని కంగన అన్నారు.

ముందుగా 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారతదేశం తరఫున ఎంపికైన మలయాళ సినిమా `జల్లికట్టు`కు అభినందనలు తెలిపారు. చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు.
`అందరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీదావుడ్ గ్యాంగ్‌కు సరైన శాస్తి జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు. మూవీ మాఫియా గ్యాంగ్.. ఇళ్లలోనే దాక్కొండి. జ్యూరీ తన
పనిని సక్రమంగా నిర్వర్తిస్తోంది. `జల్లికట్టు` చిత్రబృందానికి అభినందనలు` అంటూ కంగన ట్వీట్ చేశారు.


ఇదిలా ఉంటే కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్‌పై ఇటీవల ముంబైలో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని
ఫిట్‌నెస్ ట్రైనర్ మన్సూర్ అలీ సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కంగన, రంగోలీలపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ, 124ఏల ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. అయితే తొలి రెండు నోటీసులకు స్పందించని కంగన, మూడో నోటీసు సమయంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ధర్మాసరం వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
అక్కచెళ్లెల్లను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. 

\



మరింత సమాచారం తెలుసుకోండి: