టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ఆరెంజ్. అంతకుముందు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తదుపరి ఈ ఆరెంజ్ సినిమా అవకాశాన్ని భాస్కర్ కి ఇచ్చారు. మరోవైపు బొమ్మరిల్లు సినిమా తో సంచలన విజయం అందుకుని, ఆపై పరుగు మూవీ తో మరొక మంచి సక్సెస్ అందుకున్న భాస్కర్ ఒక్కసారిగా ఈ సినిమా అవకాశం రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లి భారీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆకట్టుకునే కథాకథనాలు ఉన్నప్పటికీ హీరోగా రామ్ చరణ్ స్థాయికి తగ్గ కథ కాదని అలానే కథనంలో అక్కడక్కడా కొంత లోపాలు ఉన్నాయని చాలా మంది ప్రేక్షకులు అప్పట్లో ఈ సినిమా పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ విషయం పక్కన పెడితే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్. ఇందులోని మొత్తం ఆరు సాంగ్స్ కూడా అద్భుతమైన రీతిలో సక్సెస్ సాధించాయి.

ఇప్పటికీ కూడా ఈ సాంగ్స్ వింటున్నంత సేపు ఎంతో ఫ్రెష్ గా కొత్తగా అనిపించడం ఈ పాటల యొక్క ప్రత్యేకత. అలానే ఈ సినిమా పాటలకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. మొత్తం ఇందులోని ఆరు పాటలు సోలో సింగిల్ సాంగ్స్ కావటం విశేషం. ఇకపోతే ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రేక్షకులు అభిమానులు అలానే సినిమా ప్రముఖులు ఆరెంజ్ సినిమా యూనిట్ కి ముఖ్యంగా హీరో రామ్ చరణ్, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరోయిన్ జెనీలియా, సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ లకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: