పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఎప్పటి నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీని సమకూరుస్తున్నారు. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న పింక్ సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా దర్శకుడు వేణు శ్రీరాం ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే కథ ప్రకారం మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు దీనిలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఆకట్టుకునే కథాకథనాలతో ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ని అలరించే విధంగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల మగువ మగువ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ తో పాటు పవర్ స్టార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ మోషన్ పోస్టర్ రెండు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి కొద్ది రోజుల క్రితం ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా వకీల్ సాబ్ లో నటిస్తున్న విషయమై శృతిహాసన్ స్పందిస్తూ, ఈ సినిమా రిలీజ్ అనంతరం ప్రేక్షకులందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని మూడోసారి పవర్ స్టార్ పక్కన నటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అలానే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జనవరిలో ప్రారంభం అవుతుందని తాను అదే సమయంలో షూటింగ్ లో పాల్గొననున్నట్లు ఆమె చెప్పారు. దీనితో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని భావించిన వారందరి ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్ పక్కాగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. మరి శృతిహాసన్  చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి ఈ సినిమా సంక్రాంతి తర్వాత రిలీజ్ అవుతుందా లేదా అదే సమయంలో రిలీజ్ అవుతుందా అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే వకీల్ సాబ్ రిలీజ్ పై ఆ మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: