మరోవైపు నాగ్ అశ్విన్ సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈలోపు మరొక నెల తర్వాత ఆదిపురుష్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని తన పాత్ర కోసం ప్రభాస్ కొంత స్లిమ్ గా తయారై బాగా ఫిట్ గా మారారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.
వారిలో ప్రముఖంగా కియారా అద్వానీ, శ్రద్ధ కపూర్, కృతి సనన్, అనుష్క శెట్టి ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు సీత గా నటిస్తారు అనే దానిపై ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాకపోవడంతో ఈ విషయమై ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారో అధికారికంగా తెలియచేయండి సార్ అంటూ పలువురు ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ మూవీ దర్శకనిర్మాతలను ఉద్దేశించి సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆదిపురుష్ టీం ప్రభాస్ ఫ్యాన్స్ అభ్యర్థనను ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి...!!