గోపరాజు రమణ..ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎక్కడ పెద్దగా తెలియదు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా వల్ల గోపరాజు రమణ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. ఈ సినిమా విజయం సాధించడం వెనక హీరో గా ఆనంద్ దేవరకొండ కి ఎన్ని మార్కులు పడుతున్నాయో అదే విదంగా రమణకు కూడా అన్నే మార్కులు పడుతున్నాయి. ఇప్పడు టాలీవుడ్ కి మరొక మంచి నాన్న దొరికాడు అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. తండ్రి పాత్రలంటే ఒకప్పుడు చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి ఇప్పుడు నరేష్ వంటి వారు మాత్రమే చేస్తున్నారు. కానీ గోపరాజు రమణ వంటి వారికి అవకాశం ఇస్తే ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఇప్పుడు అందరు చూసారు. ఎంతో మంచి నటనా నైపుణ్యం ఉన్నప్పటికి సరైన పాత్ర దొరక్క ఇలాంటి ఆణిముత్యాలు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారు.



తండ్రిగా బోలెడన్ని అవకాశాలు ప్రస్తుతం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తర్వాత రమణకు మంచి అవకాశాలు వస్తున్నాయట. చాల మంది తనలోని నటుడిని ఇప్పుడే గుర్తించారని రమణ చెప్తున్నాడు. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తమ తదుపరి సినిమాలో రమణకు అవకాశం ఇచ్చిందట. అలాగే లైన్ లో మరో ఇద్దరు టాప్ దర్శకులు కూడా ఉన్నారని తెలుస్తుంది. థియేటర్ ఆర్టిస్ట్ గా మొదలైన గోపరాజు రమణ ప్రయాణం ఇప్పుడు సరైన వేదికపై చూపించే అవకాశం రావడంతో గోపరాజు రమణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రమణ మొదటిసారి గ్రహణం అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. గోల్కొండ హైస్కూల్, అష్టా చెమ్మ, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాల్లో నటించిన ఆయనకు సరైన గుర్తింపు

మరింత సమాచారం తెలుసుకోండి: